గురువారం 04 మార్చి 2021
Karimnagar - Jan 27, 2021 , 02:34:46

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

  • రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ 

కార్పొరేషన్‌, జనవరి 26: రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలను వినియోగించుకొని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ సూచించారు. మంగళవారం స్థానిక కిసాన్‌నగర్‌లో సహారా హెల్పింగ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్ల ప్రదానం కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. స్వచ్ఛందంగా మహిళలకు కుట్టు శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. స్వయం ఉపాధికి ప్రభుత్వం తరఫున మహిళలకు ప్రత్యేక రుణాలు అందిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్‌ వై సునీల్‌రావు, కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీపతిరావు, పెండ్యాల మహేశ్‌, సుల్తానా, సంస్థ ప్రతినిధులు అస్మా, అఫ్జల్‌ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo