మంగళవారం 02 మార్చి 2021
Karimnagar - Jan 26, 2021 , 04:08:30

ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి టీకాలు

ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి టీకాలు

  • జిల్లాలో 14 సెంటర్లు, 21 సెషన్లు
  • మరో రెండు రోజులు కొనసాగింపు
  • జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సుజాత వెల్లడి

విద్యానగర్‌, జనవరి 25 : ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి కరోనా టీకాల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాలు, 21 సెషన్లలో టీకాలు వేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సుజాత తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖాన, ప్రతిమ, చల్మెడ వైద్య కళాశాలల్లో జమ్మికుంట, హుజూరాబాద్‌ దవాఖానల్లో, అపోలో, రేనె, మెడికవర్‌, అపెక్స్‌, స్టార్‌ హాస్పిటళ్లతోపాటు మోతాజీఖాన, బుట్టిరాజారాం కాలనీ, విద్యానగర్‌, సప్తగిరి కాలనీ, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో టీకాలు వేశారు. జిల్లా వ్యాప్తంగా 2078 మందికి టీకాలు వేయాల్సి ఉండగా 760 మంది టీకాలు వేసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 28, 29వ తేదీల్లో ఇవే సెంటర్లలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన సెంటర్లలో వ్యాక్సిన్‌ తీసుకోవాలని, టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వివరించారు. 

VIDEOS

logo