గురువారం 25 ఫిబ్రవరి 2021
Karimnagar - Jan 25, 2021 , 02:16:29

సీఎం సూచనల మేరకే నిరంతర విద్యుత్‌

సీఎం సూచనల మేరకే నిరంతర విద్యుత్‌

  • లోవోల్టేజీ సమస్యల పరిష్కారానికి సబ్‌స్టేషన్లు
  • క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించాలి
  • డిజిటల్‌ సేవలను వినియోగించుకోవాలి
  • ట్రాన్స్‌కో అండ్‌ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
  • ఎంపీ కెప్టెన్‌తో కలిసి వెన్నంపల్లిలో సబ్‌స్టేషన్‌ ప్రారంభం

సైదాపూర్‌, జనవరి 24: సీఎం కేసీఆర్‌ సూచన మేరకే రైతులకు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామని ట్రాన్స్‌కో అండ్‌ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. మండలంలోని వెన్నంపల్లిలో రూ. 1.50 కోట్లతో నిర్మించిన సబ్‌స్టేషన్‌ను ఆదివారం రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావుతో కలిసి ప్రారంభించారు. సబ్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కనాటి నీళ్లు పోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో లోవోల్టేజీ సమస్య పరిష్కారానికి అవసరమైన చోట సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్‌ వినియోగదారులు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించాలని కోరారు. మీటర్లు లేకుండా కరెంట్‌ను వాడుకోవద్దన్నారు. విద్యుత్‌ సంస్థ డిజిటల్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

కేసీఆర్‌ రైతు పక్షపాతి: కెప్టెన్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు పక్షపాతి అని కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో వారి సమస్యలను స్వయంగా చూసిన ఆయన వాటిని పరిష్కరిస్తున్నారని చెప్పారు. రాత్రిపూట కరెంట్‌తో విషపురుగుల బారిన పడి ఎందరో రైతులు మృత్యువాత పడ్డారని, ఈ నేపథ్యంలోనే 24 గంటల కరెంట్‌ పథకానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కరీంనగర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ పేరాల గోపాలరావు, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, హుజూరాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బర్మావత్‌ రమ, వైస్‌ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు బిల్ల వెంకటరెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, సర్పంచులు అబ్బిడి పద్మ, ఆవునూరి పాపయ్య, కాయిత రాములు, పైడిమల్ల సుశీల, రేగుల సుమలత, కొత్త రాజిరెడ్డి, బత్తుల కొమురయ్య, ఎంపీటీసీలు తొంట ఓదెలు, బద్దిపడిగ అనిత, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, ప్రధాన కార్యదర్శి చెలిమెల రాజేశ్వర్‌రెడ్డి, ఆర్‌బీఎస్‌ మండల కో ఆర్డినేటర్‌ రావుల రవీందర్‌రెడ్డి, విద్యుత్‌ అధికారులు పాల్గొన్నారు.

VIDEOS

logo