శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Karimnagar - Jan 22, 2021 , 01:24:43

మృత్యువును జయించాడు..

మృత్యువును జయించాడు..

విద్యానగర్‌, జనవరి 21: కరోనాతో ఇన్నాళ్లూ వృద్ధులకు మాత్రమే ప్రాణాపాయ స్థితి ఉండేదని, కానీ ఇప్పుడు యువకులకు కూడా ప్రాణ సంకటమేనని మెడికవర్‌ దవాఖానలో 29 రోజుల పాటు చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డ యువకుడే ఇందుకు నిదర్శనమని, మెడికవర్‌ క్రిటికల్‌ కేర్‌ ఇంటెన్సివ్‌ డాక్టర్లు ఉపేందర్‌రెడ్డి, విక్రమ్‌ తెలిపారు. గురువారం హాస్పిటల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లికి చెందిన శ్రీనివాస్‌ (38) అయ్యప్ప మాలలో ఉండగా డిసెంబర్‌ 13న జ్వరం వచ్చింది. స్థానికంగా వైద్యం చేయించినప్పటికి పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో డిసెంబర్‌ 20న కుటుంబ సభ్యులు మెడికవర్‌ దవాఖానకు తీసుకువచ్చారన్నారు. వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించగా, కొవిడ్‌తో పాటు న్యుమోనియా బారిన పడి 95 శాతం ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. ఎన్‌ఐవీ సపోర్టుతో వారం పాటు చికిత్స అందించినా ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లో వెంటిలేటర్‌పై పెట్టామన్నారు. ఆ సమయంలో తెమడ పరీక్ష చేయగా ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లు గుర్తించామన్నారు. వెంటిలేటర్‌పై ఉండి 95 శాతం ఊపిరితిత్తులు దెబ్బతిన్నవారు బతకడం అరుదైన విషయమని పేర్కొన్నారు. క్రిటికల్‌ కేర్‌ టీం అందుబాటులో ఉండడం వల్లే పూర్తిగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీనివాస్‌ను కాపాడగలిగామన్నారు. ప్రస్తుతం శ్రీనివాస్‌ పూర్తిగా కోలుకున్నాడని వెల్లడించారు. సమావేశంలో దవాఖాన అడ్మినిస్ట్రేటర్‌ గుర్రం కిరణ్‌, ఎమర్జ్జెన్సీ హెడ్‌ డాక్టర్‌ దీక్షిత్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo