భవ్య మందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలి
_1611255709.jpg)
శంకరపట్నం, జనవరి 21: శ్రీరాముడి భవ్య మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించాలని సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పెద్ది శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం చింతలపల్లి శ్రీభ్రమరాంబికామల్లికార్జునస్వామి ఆలయంలో శ్రీరామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు సమావేశమై రామ మందిర నిర్మాణ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రామ మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఆర్థిక సాయం అందించాలని కోరారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు విరాళాలు అందజేశారు. ఆలయ చైర్మన్ పల్లె మనోహర్‌రెడ్డి, నాయకులు మాడ వెంకట్‌రెడ్డి, దండు కొమురయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ
ఆర్ఎస్ఎస్ సభ్యులు అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఇంటింటా తిరిగి చందాలు సేకరిస్తున్నారు. చాకలివానిపల్లి గ్రామంలో సేకరించిన రూ.5,600 ఆర్ఎస్ఎస్ మండల ప్రముఖ్ చంద్రశేఖర్‌కు అందజేశారు.
తాజావార్తలు
- నాగార్జున ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ అప్డేట్
- వాణీదేవి గెలుపుకోసం కలిసికట్టుగా కృషి చేయాలి
- బ్యాంకుల జోరు:టాప్10 కంపెనీల ఎంక్యాప్ రూ.5.13 లక్షల కోట్లు రైజ్
- వైరల్ అవుతున్న చిరంజీవి ఆచార్య లొకేషన్ పిక్స్
- రేపటి నుంచి మలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
- న్యాక్ హైదరాబాద్‌కు సీఐడీసీ అవార్డు ప్రదానం
- ఆస్ట్రాజెనెకాను సస్పెండ్ చేసిన ఆస్ట్రియా ప్రభుత్వం
- తాగు నీటి ట్యాంక్‌కు టాయిలెట్ పైప్.. రైల్వేస్టేషన్ మాస్టర్ సస్పెండ్
- రోజూ పుచ్చకాయ తినడం మంచిదేనా