నల్లగొండ : లోడు లారీ అదుపుతప్పి బోల్తాపడటంతో లారీ డ్రైవర్‌తోపాటు క్లీనర్లకు తీవ్రగాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా కట్టంగూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అయిటిపాముల శివారులో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. కాకినాడ నుంచి కెమికల్ పౌడర్‌తో హైదరాబాద్‌కు వస్తున్న లారీ అయిటిపాముల శివారు వద్ద అదుపుతప్పి రోడ్డు దిగువకు దూసుకెళ్లి బోల్తా కొట్టింది. క్యాబిన్లో ఇరుక్కుని డ్రైవర్‌తోపాటు క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతికష్టం మీద ఇద్దరిని బయటకు తీసి చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.