శుక్రవారం 05 మార్చి 2021
Karimnagar - Jan 20, 2021 , 00:48:08

సజావుగా వ్యాక్సినేషన్‌

సజావుగా వ్యాక్సినేషన్‌

విజయవంతంగా కొనసాగుతున్న ప్రక్రియ 

రోజు రోజుకూ పెరుగుతున్న కేంద్రాలు

మూడో రోజు 86 సైట్లలో 5067 మందికి టీకా

ఇప్పటి వరకు 6624 మందికి పంపిణీ

పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. వైద్య యంత్రాంగం రోజు రోజుకూ కేంద్రాల సంఖ్య పెంచుతూ హెల్త్‌కేర్‌ వర్కర్లకు టీకా వేస్తున్నది. మంగళవారం మూడో రోజు 86 సైట్లలో 5067 మందికి వ్యాక్సిన్‌ చేయగా, మొత్తం మూడు రోజుల్లో 6624 మందికి వేసింది. 

- కరీంనగర్‌, జనవరి 19 (నమస్తే తెలంగాణ)/ విద్యానగర్‌

కరీంనగర్‌ జిల్లాలో మంగళవారం 23 సైట్లలో 2,263 మంది హెల్త్‌ కేర్‌ వర్కర్లకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 1,545 మందికి వేశారు. పెద్దపల్లి జిల్లాలో 24 కేంద్రాల్లో 1130 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. జగిత్యాల జిల్లాలో 24 సెంటర్లలో 1606 మందికి టీకా ఇచ్చినట్లు జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌ తెలిపారు. జగిత్యాల రూరల్‌ మండలం కల్లెడ పీహెచ్‌సీలో జరిగిన కార్యక్రమానికి జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత హాజరయ్యారు. ఇక్కడ మొదటి టీకాను డిప్యూటీ డీఎంహెచ్‌వో జైపాల్‌రెడ్డి తీసుకున్నారు. మల్యాల మండలం ప్రభుత్వ దవాఖానతోపాటు బోయినపల్లి మండలం కొదురుపాకలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 15 కేంద్రాల్లో 786 మందికి వ్యాక్సిన్‌ వేశారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన సైట్‌ను కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ సందర్శించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, కోనరావుపేట మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, సిరిసిల్ల సుందరయ్యనగర్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ వ్యాక్సినేషన్‌ సైట్లను ప్రారంభించారు. కాగా, కోనరావుపేట మండలంలో జిల్లా వైద్యాధికారి సుమన్‌మనోహర్‌రావు టీకా తీసుకున్నారు. 


VIDEOS

logo