ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Karimnagar - Jan 17, 2021 , 03:23:52

పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి

పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి

కొత్తపల్లి, జనవరి 16: విద్యా సంస్థల్లో పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని ఎంపీపీ పిల్లి శ్రీలతామహేశ్‌ సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ప్రధానోపాధ్యాయులు, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, ఫిబ్రవరి ఒకటి నుంచి విద్యా సంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో  పారిశుధ్య పనులు చేపట్టాలని, మూత్రశాలలు, మరుగుదొడ్లను శుభ్రం చేయాలని సూచించారు.  ప్రతి తరగతి గదిలో 20 మందికి మించకుండా విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్‌ ధరించేలా అవగాహన కల్పించాలన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ పిట్టల కరుణ, మండల ప్రత్యేకాధికారి నవీన్‌కుమార్‌, మండల వైద్యాధికారి వంశీకృష్ణ, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్‌, కార్యదర్శులు పాల్గొన్నారు. 

కరీంనగర్‌ రూరల్‌, జనవరి 16: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో  పారిశుధ్య పనులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య సూచించారు.  కరీంనగర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో  వైద్యాధికారి వంశీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఎంపీపీ ముఖ్య అతిథిగా  హాజరై మాట్లాడారు. ఫిబ్రవరి ఒకటి నుంచి విద్యా సంస్థలు ప్రారంభిస్తున్నందున   పారిశుధ్య పనులు చేపట్టాలని కోరారు. ఎంపీడీవో పవన్‌కుమార్‌, ఏపీవో రాంగోపాల్‌రెడ్డి, మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయుడు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 


VIDEOS

logo