ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Karimnagar - Jan 17, 2021 , 03:23:50

పోలీసుల అదుపులో ఇరానీ గ్యాంగ్‌ సభ్యుడు

పోలీసుల అదుపులో ఇరానీ గ్యాంగ్‌ సభ్యుడు

రాంనగర్‌, జనవరి 16: ఒంటరి మహిళలే లక్ష్యంగా రెప్పపాటులో దాడిచేసి బంగారు గొలు సులు కొట్టేసే అంతర్రాష్ట్ర ఇరానీ గ్యాంగ్‌పై కరీంనగర్‌ పోలీసులు పంజా విసిరారు. ముఠాలో కీలక సభ్యుడిని చాకచక్యంగా పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. ఈ మేరకు శనివారం కమిషనరేట్‌లో సీపీ కమలాసన్‌రెడ్డి విలేకరులతో వివరాలు వెల్లడించారు. 2020 డిసెంబర్‌1న కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వృద్ధురాలు మార్కె ట్లో నడుచుకుంటూ వెళ్తుండగా, మోటార్‌ సైకిల్‌పై ఇద్దరు దొంగలు వచ్చి ఆమె మెడలోంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు కరీంనగర్‌ నుంచి హైదరాబా ద్‌ వైపు వెళ్లినట్లు గుర్తించారు. రేణిగుంట, దుద్దెడ టోల్‌ గేట్లలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా, సిద్దిపేట సమీపంలో ఓ కారును వీరు ఫాలో అవుతున్నట్లు గమనించారు. ఆ కారు నం బర్‌ ఆధారంగా వీరంతా ఇరానీ గ్యాంగ్‌గా నిర్ధారణకు వచ్చారు. అప్పటి నుంచి వారి కదలికలపై నిఘా పెట్టారు, ఈ క్రమంలో జమ్మికుంట రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతంలో ప్రధాన నిందితుడైన భాకర్‌ అలీ అలియాస్‌ బుల్లెట్‌ బాఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగితా వారు పరారీలో ఉ న్నారు. బుల్లెట్‌ బాఖర్‌ కర్ణాటకలోని బీదర్‌ జి ల్లాకు చెందిన వ్యక్తి కాగా, ఇతని పై ఇప్పటికే పలు రాష్ర్టాల్లో వందల కేసులు నమోదై ఉన్నాయి. కేసును చేధించిన పోలీసులను సీపీ ప్రత్యేకంగా అభినందించి పారితోషికాలు అందజేశారు.


VIDEOS

logo