సంబురాల సంక్రాంతి

నేడు సంక్రాంతి.. రేపు కనుమ
భోగితో మొదలైన వేడుకలు
పిల్లాపాపలతో సందడిగా ఇండ్లు
ఇంటింటా సకినాలు, గారెల కరకరలు
సందడిగా పల్లెలు
కమాన్ చౌరస్తా, జనవరి 13 : నేడు సంక్రాంతి. సకల సౌభాగ్యాల పండుగ. సూర్యుడు దక్షిణాయణం చాలించి, ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా జరుపుకోవడం ఆనవాయితీ. దీనికి ముందు రోజు భోగితో మూడు రోజుల వేడుక మొదలైంది. బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భోగిని ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారు జామునే భోగి మంటలు వేశారు. అనంతరం పిల్లలకు తలస్నానం చేయించి, భోగిపండ్లను పోశారు. ఉదయాన మహిళలు వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో నింపి, వాటి మధ్య ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ఉంచారు. వాటిపై గరక పోసలు ఉంచి, చుట్టూ నవధాన్యాలు, పండ్లు పోశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేర్వేరు చోట్ల నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు పాల్గొన్నారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి, చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కరీంనగరంలోని తెలంగాణ చౌక్‌లో మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మేయర్ అనిల్‌కుమార్ భోగి మంటలు వెలిగించారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఇంటిలోనూ సంతోషం వెల్లివిరియాలని అకాంక్షించారు.
రైతన్నకు ప్రత్యేకం కనుమ..
ఇక సంక్రాంతి తర్వాత రోజు జరుపుకునే పండుగ కనుమ. ‘కనుమ’ అంటే పశువు అని అర్థం. దుక్కి దున్నిన నాటి నుంచి పంట ధాన్యాన్ని గాదెలకు చేర్చేవరకు శ్రమించిన పశువులను ఆరాధించడమే కనుము పండుగలోని పరమార్థం. కనుము రోజున పశువులను కడిగి పసుపు బొట్లను, కుంకుమను కొమ్ములకు అలంకరించి ముఖానికి బొట్టు పెట్టి ఊరేగిస్తారు. అలాగే, కనుమ రోజు పితృదేవతలకు పూజలు చేస్తారు. సంక్రాంతి రోజు తమ ఇండ్లలో రైతులు పాలుపొంగించుకుంటారు. పాయసం చేసుకుంటారు. పశువులను పూజించే పండుగ అయిన కనుమను ఘనంగా జరుపుకుంటారు.
తాజావార్తలు
- ప్రదీప్ కోసం అనసూయ, రష్మి, శ్రీముఖి ప్రమోషన్స్
- కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ రెండో వార్షికోత్సవం
- దావోస్ సదస్సులో ప్రసంగించనున్న మోదీ
- సుధీర్ బాబు లెగ్ వర్కవుట్స్..వీడియో వైరల్
- పసుపు రైతులను ఆదుకోవడంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలం
- వివాహ విందు కోసం వచ్చి.. కానరాని లోకాలకు..!
- అమిత్ షా పదవికి రాజీనామా చేయాలి : రణదీప్ సూర్జేవాలా
- మీ పిల్లలకు రైస్ మిల్క్ తాగిస్తున్నారా!
- అన్‌లాక్ : తెరుచుకోనున్న స్విమ్మింగ్ పూల్స్
- 23 లక్షలు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు