గురువారం 04 మార్చి 2021
Karimnagar - Jan 13, 2021 , 01:24:09

వివేకానందుడి అడుగు జాడల్లో నడవాలి

వివేకానందుడి అడుగు జాడల్లో నడవాలి

ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌

నియోజకవర్గ వ్యాప్తంగా జయంతి వేడుకలు

 చొప్పదండి, జనవరి 12: యువత స్వామి వివేకానందుడి అడుగు జాడల్లో నడవాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. పట్టణంలో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వివేకానందుడి జయంతి వేడుకలు నిర్వహించారు. వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వివేకానందుడు దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుర్రం నీరజ, సింగిల్‌విండో చైర్మన్‌ వెల్మ మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బందారపు అజయ్‌కుమార్‌గౌడ్‌, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు మామిడాల నిరంజన్‌, సభ్యులు గొల్లపల్లి శ్రావణ్‌కుమార్‌, మంచాల మోహన్‌, తాటిపెల్లి శివ, గుండ్ల శంకర్‌, అలుస లక్ష్మీనారాయణ, ఆంజనేయులు, తాటిపల్లి ఆంజనేయులు, సత్యం, నాయకులు నలుమాచు రామకృష్ణ, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌,  సీపెల్లి గంగయ్య, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే, లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు కొల్లూరి జితేందర్‌, కోశాధికారి గుర్రం విష్ణువర్ధన్‌రెడ్డి వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యువశక్తి భవనంలో వివేకానందుడి చిత్రపటానికి ఏబీవీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  నగర కార్యదర్శి లక్ష్మీపతి, నాయకులు సాయి, ఉపేందర్‌, కార్తీక్‌, ప్రశాంత్‌, సాగర్‌, రాజ్‌కుమార్‌, అజయ్‌, ఆదర్శ్‌ పాల్గొన్నారు.

యువతకు స్ఫూర్తి వివేకానంద

రామడుగు, జనవరి 12: యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తిప్రదాతగా నిలుస్తారని అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ పేర్కొన్నారు. వెదిర పంచాయతీ పరిధిలోని రాజాజీనగర్‌ క్రాస్‌రోడ్డు కూడలిలో జాతీయ యువజన అవార్డు గ్రహీత అలువాల విష్ణు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ, భావితరాలకు వివేకానందుడు మార్గదర్శకుడని కొనియాడారు. కాగా, మండల కేంద్రంలో పిట్‌ రామడుగు క్రీడాకారుల ఆధ్వర్యంలో స్థానిక ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో, గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో వెదిర సర్పంచ్‌ తీగల సంగీత, జాతీయ యువజన అవార్డు గ్రహీతలు రేండ్ల కళింగశేఖర్‌, అలువాల విష్ణు, ఎంపీటీసీలు అనిల్‌కుమార్‌, హరీశ్‌, ఉప సర్పంచ్‌ సత్యనారాయణరెడ్డి, వీడీసీ చైర్మన్‌ నాగుల రాజశేఖర్‌గౌడ్‌, లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు ఎర్రం లక్ష్మణ్‌, యువజన సంఘాల నాయకులు గజ్జెల అశోక్‌, అంబటి వినోద్‌, కొలిపాక కమలాకర్‌, శనిగరపు అర్జున్‌, మచ్చ రమేశ్‌, బాపురాజు, సురేశ్‌, ఆరె వినోద్‌, పున్న కనుకయ్య, వెన్న రాజమల్లయ్య, అనిల్‌, అజయ్‌, రాజేశం, వివేకానంద, శ్రీనివాస్‌, లక్ష్మీపతి, పర్రెం లక్ష్మారెడ్డి, ఎడ్ల శ్రీనివాస్‌, వైద రామానుజం, శంకరయ్య, అనంతరెడ్డి, వీర నర్సయ్య, క్రీడాకారులు కలిగేటి ఎల్లయ్య, ఐతరవేణి శ్రీనివాస్‌, జక్కుల శ్రీను, కలిగేటి మునీందర్‌, నమిలకొండ ప్రభాకర్‌, బీజేవైఎం జిల్లా సభ్యుడు పూరెల్ల శ్రీకాంత్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు బొమ్మరవేని తిరుపతి, ఉప సర్పంచ్‌ రాజేందర్‌, వార్డు సభ్యులు శ్రీనివాస్‌, నీలం రవి, ఎండీ మొయిజ్‌, సంజీవ్‌, కాంతయ్య పాల్గొన్నారు. 

కరీంనగర్‌ రూరల్‌: జనవరి 12: చామనపల్లిలో వివేకానందుడి విగ్రహానికి ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, వివేకానంద యూత్‌ క్లబ్‌ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథులుగా నాయకులు ఇజాజ్‌ అహ్మద్‌, ఆవుల ముత్యం, తహసీల్దార్‌ నల్ల వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో పవన్‌కుమార్‌, రూరల్‌ సీఐ తులా శ్రీనివాస్‌ రావు హాజరయ్యారు. అనంతరం జబర్దస్త్‌ టీమ్‌ లీడర్‌ వెంకీ మంకీల హాస్యం గ్రామస్తులను అలరించింది. నాగతేజ్‌, చామనపల్లి పెళ్లికళ బృందం జానపద గేయాలు అలరించాయి.  కార్యక్రమంలో సర్పంచ్‌ బోగొండ లక్ష్మీఐలయ్య, ఎంపీటీసీలు బుర్ర తిరుపతి గౌడ్‌, వైస్‌ ఎంపీపీ వేల్పుల నారాయణ, సింగిల్‌ విండో చైర్మన్‌ శ్యాంసుందర్‌ రెడ్డి, అంకమల్ల శ్రీనివాస్‌, వినయ్‌సాగర్‌, సర్పంచ్‌ దబ్బెట రమణారెడ్డి, నందు, భూమయ్య, జక్కం నర్సయ్య, అంజిరెడ్డి, యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.    

కరీంనగర్‌ రూరల్‌, జనవరి 12: బొమ్మకల్‌లో వివేకానందుడి చిత్రపటానికి  వివేకానంద యూత్‌ క్లబ్‌ సభ్యులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.  క్లబ్‌ సభ్యులు శశికుమార్‌, మహేశ్‌, ప్రశాంత్‌, శివ, సాయి, వెంకటేశ్‌, ఈశ్వర్‌, అభి, సాయి, సాగర్‌, రాకేశ్‌, రామ్‌, నిశాంత్‌, అక్షయ్‌, రాజు సన్ని తదితరులు పాల్గొన్నారు.   

కరీంనగర్‌ రూరల్‌, జనవరి 12: కరీంనగర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో స్వామి వివేకానంద చిత్రపటానికి ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, ఎంపీడీవో పవన్‌కుమార్‌, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు బుర్ర తిరుపతి గౌడ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీటీసీలు వినయ్‌సాగర్‌, కరీంనగర్‌ ప్యాక్స్‌ చైర్మన్‌ పెండ్యాల శ్యాంసుందర్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌ సంపత్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ ప్రసాద్‌, మోహన్‌, పద్మ, సిబ్బంది పాల్గొన్నారు.

కరీంనగర్‌ రూరల్‌, జనవరి 12: తీగలగుట్టపల్లి(ఒకటో డివిజన్‌)లో వివేకానందుడి చిత్రపటానికి కార్పొరేటర్‌ కొలగాని శ్రీనివాస్‌ పూలమాల వేసి, నివాళులర్పించారు. నేషనల్‌ యూత్‌ ప్రాజెక్ట్‌ రాష్ట్ర అధ్యక్షుడు యాదవరాజు, యువజన నాయకులు కైలాస నవీన్‌, కొలగాని సతీశ్‌, శ్రావణ్‌, ఎలుక అభిలాష్‌, ఎస్‌ సాయి, కిరణ్‌, చందన్‌, రాజు, సాయికిరణ్‌, రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.  


VIDEOS

logo