శుక్రవారం 05 మార్చి 2021
Karimnagar - Jan 03, 2021 , 01:30:08

పేదలకు మెరుగైన వైద్యసేవలందిస్తాం

పేదలకు మెరుగైన వైద్యసేవలందిస్తాం

కరీంనగర్‌ రూరల్‌, జనవరి 2: నిరుపేదలకు మెరుగైన సేవలందించేందుకే ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు  మెడికవర్‌ దవాఖాన అడ్మినిస్ట్రేటర్‌ గుర్రం కిరణ్‌ తెలిపారు. నగర శివారులోని షేకాబీ కాలనీ(రేకుర్తి)లో శనివారం దవాఖాన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయగా, కార్పొరేటర్లు ఏదుల రాజశేఖర్‌, సుధగోని మాధవీకృష్ణ గౌడ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మెడికవర్‌ దవాఖాన యాజమాన్యం పేదలకు ఉచితంగా వైద్య సేవలందించడంతో పాటు బీపీ, షుగర్‌, ఈసీజీ పరీక్షలు చేయడం అభినందనీయమన్నారు. సుమారు 100 మందికి పరీక్షలు చేసి, ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా దవాఖాన అడ్మినిస్ట్రేటర్‌  గుర్రం కిరణ్‌ మాట్లాడుతూ, ముగ్గురు గుండె వైద్య నిపుణులతో పాటు 24 గంటలు వైద్య సేవలందిస్తున్నట్లు తెలిపారు.  వైద్యుడు ఆనంద్‌, దవాఖాన సిబ్బంది, కొత్తపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  


VIDEOS

logo