ఖాతాల్లోకి పెట్టుబడి సాయం

- యాసంగి ప్రారంభంలోనే నగదు జమ
- సీఎం కేసీఆర్ పేరిట సెల్ఫోన్లకు మెస్సేజ్‌లు
- సాయాన్ని వ్యవసాయ పనులకు ఉపయోగించుకోవాలని సూచన
- ఆనందంలో రైతులు
- ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం
కరోనా కష్టకాలంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ కర్షకుల వెంటే నిలిచారు. యాసంగి సాగుకు సిద్ధమైన తరుణంలో రైతుబంధు కింద సాయం అందించి భరోసా ఇచ్చారు. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమవుతుండగా, సెల్ఫోన్లకు సీఎం పేరిట మెసేజ్‌లు వస్తుండడంతో అన్నదాతలు ఆనందంలో మునిగిపోయారు. సీజన్ ప్రారంభంలో పెట్టుబడికి పైసలు అందుతుండడంతో సంబురపడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు. సీఎం సారు చెప్పినట్లే రైతుబంధు సాయాన్ని పంట పెట్టుబడి, వ్యవసాయ పనులకు ఉపయోగించుకుంటామని చెబుతున్నారు.
- కరీంనగర్, నమస్తే తెలంగాణ
కరీంనగర్, నమస్తే తెలంగాణ : కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం గురించే ఆలోచించారు. ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. యాసంగి సీజన్ ప్రారంభంలోనే రైతుబంధు కింద పెట్టుబడి అందుతుండగా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2018 లో ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటికే ఐదుసార్లు సాయం అందించారు. ఆరోసారి నగదు పంపిణీ సోమవారం నుంచే ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో 6,36,464 మంది రైతులు ఉండగా, ప్రాధాన్యతా క్రమంలో ఎకరంలోపు ఉన్న రైతుల ఖాతాల్లో ముందు గా జమచేస్తున్నట్లు తెలుస్తున్నది. కరోనా నేపథ్యంలో ఈ సారి పంపిణీ విధానంలో కూడా మార్పులు తెచ్చారు. ఎక్కువగా పోస్టాఫీసుల ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. సకాలంలో పెట్టుబడి సాయం అందుతుండడంతో రైతులు సంబురపడుతున్నారు.
స్థానికంగానే నగదు విత్‌డ్రా..
గతంలో రైతుబంధు నగదు ఖాతాల్లో పడినప్పుడు సెల్ఫోన్లకు బ్యాంకుల నుంచి మెస్సేజ్ వచ్చేది. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ పేరుతో సందేశాలు వస్తునాయి. “తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు (యాసంగి-2020) పథకం ద్వారా మీ ఖాతాలో నగదు జమచేసింది. ఈ సహాయం పెట్టుబడి, ఇతర వ్యవసాయ పనుల కోసం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రి” అనే సందేశం సెల్ఫోన్లకు వస్తున్నది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మైక్రో ఏటీఎంల ద్వారా నగదు సులువుగా డ్రా చేసుకునే అవకాశం ఏర్పడిందని సంతోషపడుతున్నారు. ఊళ్లోనే పోస్టాఫీసులకు వెళ్లి విడిపించుకుంటున్నారు. మరికొందరు అందుబాటులో ఉన్న బ్యాంకులు, ఏంటీఎంల్లోనూ తీసుకుంటున్నారు. సకాలంలో అందుతున్న పెట్టుబడిని వ్యవసాయ పనులకే ఉపయోగించుకుంటామని పలువురు రైతులు స్పష్టం చేస్తున్నారు. సోమవారం ఉమ్మడి జిల్లాలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తంగళ్లపల్లి, మానకొండూర్, ముస్తాబాద్‌లో రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశా రు. బోయినపల్లిలో రైతులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే రవిశంకర్ సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. రైతులను రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పిన ఆయన, దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు.
తాజావార్తలు
- రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ట్రయల్ రన్
- రాష్ట్రంలో 40 డిగ్రీలకు చేరువలో ఎండలు
- 28-02-2021 ఆదివారం.. మీ రాశి ఫలాలు
- షీ టీమ్స్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిరుద్యోగులకు.. కొలువులు
- అతివేగం.. ప్రాణం తీసింది
- మెరుగైన సేవలకు.. చేతులు కలపండి
- పారిశ్రామిక పురోభివృద్ధిలో మేడ్చల్
- సఫారీ టూర్.. మరింత కొత్తగా
- హైదరాబాద్ స్టార్టప్‌కు ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ అవార్డు
- రూ.60 లకు తిన్నంత బిర్యానీ