శనివారం 27 ఫిబ్రవరి 2021
Karimnagar - Dec 27, 2020 , 01:23:30

నేనున్నా.. మీరు బాగా చదవండి

నేనున్నా.. మీరు బాగా చదవండి

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌

విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ

హుజూరాబాద్‌టౌన్‌: ‘ఎలాంటి సహాయం చేసేందుకైనా సిద్ధంగా ఉన్న, బాగా చదివి ఉద్యోగాలు సాధించండి’ అంటూ పోలీసు శిక్షణ పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెన్నుతట్టారు. హుజూరాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆధ్వర్యంలో హైస్కూల్‌ క్రీడామైదానంలో ఉమ్మడి జిల్లాస్థాయి ఉచిత పోలీస్‌ శిక్షణ పొందుతున్న 131 విద్యార్థులకు శనివారం మంత్రి క్యాంప్‌ ఆఫీస్‌లో స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం త్వరలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేయనున్నదని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే పోలీసు శిక్షణ పొందుతున్న విద్యార్థులకు అల్పాహారంతోపాటు స్టడీ మెటీరియల్‌ అందించగా వారు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కోరడంతో మంత్రి సానుకూలం గా స్పందించారు. కాగా, అడిగిన వెంటనే మెటీరియల్‌ అందజేసిన మంత్రికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ శశాంక, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, మున్సిపల్‌ చైర్మన్లు గందె రాధిక, టీ రాజేశ్వర్‌రావు, వైస్‌ చైర్‌పర్సన్లు కొలిపాక నిర్మల, దేశిని స్వప్న, కేడీసీసీ ఉపాధ్యక్షుడు రమేశ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఏ కొండాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, పోలీస్‌ శిక్షణ శిబిరం కన్వీనర్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ ఏ నిర్మల, ఆర్గనైజర్‌ జీ తులసీదాస్‌, పీడీలు కే రాజిరెడ్డి, వై రవి, కే శ్రీనివాస్‌, పలువురు కౌన్సిలర్లు ఉన్నారు.

VIDEOS

logo