శనివారం 06 మార్చి 2021
Karimnagar - Dec 26, 2020 , 00:17:02

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

 చొప్పదండి: మండల కేంద్రంతో పాటు భూపాలపట్నం చర్చిల్లో  శుక్రవారం  క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ మాచర్ల సౌజన్యవినయ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుర్రం నీరజ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యమిస్తూ బతుకమ్మ, రంజాన్‌, క్రిస్మస్‌కు దుస్తులు పంపిణీ చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఎమ్మెల్యే సతీమణి దీవెన, పాస్టర్‌ శాంతికుమార్‌ పాల్గొన్నారు.

గంగాధర: మండలంలో క్రైస్తవులు క్రిస్మస్‌ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. కొత్త బట్టలు ధరించి చర్చిలకు వెళ్లి ప్రార్థన చేశారు. పలు చర్చిల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ర్యాలపల్లిలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు పుల్కం నర్సయ్య క్రైస్తవులకు పండుగ కానుక, స్వీట్లు అందజేశారు.  ఆయా చర్చిల పాస్టర్లు ప్యాట యాదిప్రకాశ్‌, గడ్డం పీటర్‌,  సాగర్‌, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo