శనివారం 06 మార్చి 2021
Karimnagar - Dec 26, 2020 , 00:17:02

ప్రత్యేక పూజలు.. అభిషేకాలు

ప్రత్యేక పూజలు.. అభిషేకాలు

ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు

ఉత్తర ద్వారం ద్వారా దైవదర్శనం

 చొప్పదండి: నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. చొప్పదండి పట్టణంలోని శివకేశవాలయంలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయ ఆవరణలో విష్ణు శ్రీదేవి-భూదేవి, పార్వతీపరమేశ్వరుల కల్యాణ మహోత్సవం జరిపించగా భక్తులు తిలకించి, స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మండల కేంద్రంలోని వేంకటేశ్వర-మణికంఠాలయంలో అయ్యప్ప విగ్రహానికి దీక్షాపరులు పంచామృతాభిషేకం చేశారు.  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుర్రం నీరజ, వైస్‌ చైర్‌పర్సన్‌ ఇప్పనపల్లి విజయలక్ష్మి-సాంబయ్య, వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు నిరంజన్‌, సభ్యులు దూస రాము, దండె శ్రీనివాస్‌, సిరిపురం తిరుపతి, గోవులకొండ ఆంజనేయులు, అర్చకులు జనగామ సత్యనారాయణ, సింహాచలం జగన్‌మోహన్‌, సింహాచలం మురళి, సింహాచలం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

గంగాధర: మండలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుపుకొన్నారు. వేకువజాము నుంచే ఆలయాలకు వెళ్లి దేవతామూర్తులను దర్శించుకుని, పూజలు చేశారు. ఆలయాల్లో ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయాల్లో భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దైవదర్శనం చేసుకున్నారు.

రామడుగు: మండలంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులతో కిటకిటలాడాయి. వెలిచాలలోని లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వీర్ల ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తూ, గోదా రంగనాయకుల ఉత్సవమూర్తులకు వేద పండితులు పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోపాల్‌రావుపేట అయ్యప్ప ఆలయంలో ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవమూర్తులను షావలో ఉంచి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. సీతారామచంద్ర స్వామి, వెదిర వేంకటేశ్వర స్వామి, రామడుగు విఠలేశ్వర స్వామి, షాపురం వేణుగోపాల స్వామి, తదితర ఆలయాల్లో స్వామి వారు భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చారు. వెలిచాల సర్పంచ్‌ వీర్ల సరోజన ప్రభాకర్‌రావు దంపతులు, మాజీ జడ్పీటీసీ వీర్ల కవిత, సింగిల్‌విండో చైర్మన్‌ వీర్ల వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ వీర్ల రవీందర్‌రావు, వార్డు సభ్యులు మీస వెంకటి, మల్లేశం, ఆర్బీఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు పెరుమాండ్ల శ్రీనివాస్‌, నాయకులు వీర్ల సంజీవరావు, కాడె అజయ్‌, సీపెల్లి పోచమల్లు, పొన్నం ప్రకాశ్‌, గోపాల్‌రావుపేట వేంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ నార్ల రమేశ్‌, దొనపాటి సీతారాంరెడ్డి, అయ్యప్ప ఆలయ కమిటీ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి, సీతారామచంద్ర స్వామి ఆలయ చైర్మన్‌ హన్మంతరెడ్డి, భక్తులు పాల్గొన్నారు. 

కరీంనగర్‌ రూరల్‌: చెర్లభూత్కూర్‌లోని లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దైవదర్శనం చేసుకున్నారు. సర్పంచ్‌ దబ్బెట రమణారెడ్డి, ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ పెండ్యాల శ్యాంసుందర్‌ రెడ్డి,  ఉపసర్పంచ్‌ చిట్కూరి శేఖర్‌, మాజీ ఎంపీటీసీ కూర నరేశ్‌రెడ్డి, నల్ల శ్రీనివాస్‌ రెడ్డి, కూర శ్యాంసుందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఎలబోతారం మురళీకృష్ణ ఆలయం, బొమ్మకల్‌ రామాంజనేయ ఆలయం, జూబ్లీనగర్‌ సీతారామచంద్ర స్వామి ఆలయం, చేగుర్తి, దుర్శేడ్‌లోని వేణుగోపాల స్వామి ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

VIDEOS

logo