హైదరాబాద్ : నటుడు జేడీ చక్రవర్తి నటించిన సత్య మూవీ నుండి దర్శకుడు రాంగోపాల్ వర్మ త్రోబాక్ స్టిల్‌ను పంచుకున్నారు. తన సహాయకులు అదితి, బర్నాలిలతో సెట్లో కలిసి ఉన్న చిత్రాన్ని ఆర్జీవీ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. సత్య మూవీ 1998లో విడుదలైన సంగతి తెలిసిందే. జేడీ చక్రవర్తి, మనోజ్ బాజ్‌పాయీ, ఉర్మిలా మండోద్కర్, షెఫాలి షా ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ అందుకుంది. రాం గోపాల్ వర్మ తన తదుపరి చిత్రం డేంజరస్తో బిజీగా ఉన్నాడు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి లెస్బియన్ క్రైమ్-యాక్షన్ చిత్రంగా రూపొందింది. ఇందులో అప్సర రాణి, నైనా గంగూలీ నటించారు. ప్రేమ, స్వేచ్ఛ కోసం పోరాడే చిత్రంగా ఈ మూవీ తెరకెక్కింది.