గురువారం 04 మార్చి 2021
Karimnagar - Dec 06, 2020 , 01:20:45

12న జాతీయ మెగాలోక్‌ అదాలత్‌లు

12న జాతీయ మెగాలోక్‌ అదాలత్‌లు

  •  జిల్లా జడ్జి ప్రియదర్శిని

కరీంనగర్‌ లీగల్‌ : జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ పర్యవేక్షణలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈ నెల 12న జాతీయ లోక్‌ అదాలత్‌లు నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ఎంజీ ప్రియదర్శిని తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొవిడ్‌ నేపథ్యంలో కేసుల పెండింగ్‌ను తగ్గించేందుకే లోక్‌ అదాలత్‌ల్లో కేసుల పరిష్కారంపై శ్రద్ధ చూపుతున్నామని చెప్పారు. కక్షిదారులు రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. వాహన ప్రమాదాల కేసుల్లో బాధితులకు సరైన నష్ట పరిహారం అందించేలా చూస్తామన్నారు. కుటుంబంలో ఒకరు చనిపోతే ఆ కుటుంబం పడే బాధను అర్థం చేసుకోగలమని తెలిపారు. ఈ లోక్‌ అదాలత్‌లో 1638 రాజీ చేయదగిన కేసులను గుర్తించి వాటిలో ఇరు వర్గాలకు నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు.  వెయ్యి కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీవీ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ల విజయవంతానికి న్యాయవాదులు సహకరిస్తారని చెప్పారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ, కార్యదర్శి న్యాయమూర్తి సుజయ్‌ మాట్లాడుతూ శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు లోక్‌ అదాలత్‌లు నిర్వహిస్తామని వెల్లడించారు. 


VIDEOS

logo