వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

- జిల్లా పశువైద్యాధికారి నరేందర్
- గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ
చొప్పదండి: గొర్రెలు, మేకలకు సోకే వ్యాధులపై పెంపకందారులు అప్రమత్తంగా ఉంటూ, జాగ్రత్తలు పాటించాలని జిల్లా పశువైద్యాధికారి నరేందర్ సూచించారు. మండలంలోని రుక్మాపూర్‌లో గురువారం వైద్య సిబ్బంది గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేయగా, ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉచిత పశు వైద్య శిబిరాలను పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి శశికాంత్‌రెడ్డి, వీఎల్వో నరేందర్, వీఏ రాము తదితరులు పాల్గొన్నారు.
గంగాధర: మండలంలోని న్యాలకొండన్నపల్లి, కాసారం, లక్ష్మీదేవిపల్లి, నాగిరెడ్డిపూర్ గ్రామాల్లో గురువారం 4,800 గొర్రెలు, 840 మేకలకు నట్టల నివారణ మందు వేసినట్లు పశువైద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కాగా, కొండన్నపల్లిలో వైద్య సిబ్బంది మూగజీవాలకు నట్టలు మందు వేస్తున్న తీరును రాష్ట్ర పర్యవేక్షణాధికారి బక్కయ్య, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి నరేందర్ పరిశీలించారు. గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి దినేశ్‌రెడ్డి, సర్పంచులు రేండ్ల జమున, వేముల దామోదర్, తాళ్ల విజయలక్ష్మి, పంజాల లక్ష్మి, ఉపసర్పంచ్ నిమ్మనవేణి ప్రభాకర్, నాయకులు రేండ్ల శ్రీనివాస్, గొర్రెల కాపరుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
రామడుగు: మండలంలోని రామడుగు, శ్రీరాములపల్లె, దేశ్రాజ్పల్లెలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యవేక్షణ అధికారి, సహాయ సంచాలకుడు డా.బక్కయ్య పరిశీలించారు. మూడు గ్రామాల్లో 6335 గొర్రెలు, 710 మేకలకు నట్టల నివారణ మందు వేసినట్లు మండల వైద్యాధికారి మనోహర్ వివరించారు.
తాజావార్తలు
- రాధేశ్యామ్ యూనిట్‌కు ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
- పట్టు బిగిస్తున్న భారత్.. నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి దరఖాస్తుల స్వీకరణ
- మెట్రో వెంచర్.. ఆదాయంపై ఫోకస్
- రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
- ముదిరాజ్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
- బోగస్ గుర్తింపు కార్డులతో చిత్రపురి కాలనీలో ఫ్లాట్లు
- వివిధ కారణాలతో పలువురి ఆత్మహత్య
- సీసీ కెమెరాలు పట్టించాయి..
- సౌర విద్యుత్‌పై గ్రేటర్ వాసుల ఆసక్తి