‘ఆత్మనిర్భర్'ను సద్వినియోగం చేసుకోవాలి

- టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు
- కొత్తగా ఎన్నికైన పీఏసీఎస్ అధ్యక్షులకు అవగాహన కార్యక్రమం
కరీంనగర్, నమస్తే తెలంగాణ: నాబార్డు ఆధ్వర్యం లో అమలవుతున్న ఆత్మనిర్భర్ భార త్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులకు సూచించారు. స్థానిక డీసీసీబీలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షులకు నిర్వహిస్తున్న మూడు రోజుల అవగాహన కార్యక్రమాన్ని బుధ వా రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సహకార సంఘాల ముఖ్యోద్దేశాలు, సూత్రాలు, పరపతి వ్యవస్థ, తెలంగాణ సహకార చట్టాల గురించి వివరించారు. ఆత్మనిర్భర్ కింద రుణాలను తీసుకొని సంఘాలను బలోపేతం చేసుకోవాలని కోరారు. గోదాంల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు తక్కువ వడ్డీకే రుణాలు ఆందిస్తున్న నాబార్డ్‌కు కృ తజ్ఞతలు తెలిపారు. నిబంధనల మేరకు త్వరితగతిన రుణాలు ఇస్తామన్నారు. సం ఘా లకు స్వయంప్రతిపత్తి ఉన్నందున మరిన్ని ఆర్థిక సేవలందించవచ్చన్నారు. టెస్కాబ్ సిటీ ఐ ఫ్యాకల్టీ ఎన్వీ నరసింహారావు మాట్లాడుతూ పాలకవర్గ సమావేశాలు, విధులు, బాధ్యతలు, మహాజన సభ అధికారాలు, వ్యవసాయ రుణాలు, పరపతి, కిసాన్ క్రెడిట్ కార్డు, స్వల్ప, దీర్ఘ కాలిక రుణాల మంజూరు విధానం, వ్యాపార విస్తరణ, సంఘ కంప్యూ టరీకరణ, రుణ వసూళ్ల నిర్వహ ణ, నిరర్థక ఆస్తులపై చట్టపరమైన చర్యల గురించి వివరించారు. బ్యాంకు ఉపాధ్యక్షుడు పింగలి రమే శ్ మాట్లాడుతూ అవగాహన సదస్సుకు సంఘాల అధ్యక్షులందరూ హాజరుకావాలని కోరారు. బ్యాంకు సీఈవో ఎన్ సత్యనారాయణరావు సదస్సుకు వచ్చిన అతిథులకు ఆహ్వానం పలికారు.
అంతరాయానికి చింతిస్తున్నాం..
పోటీ ప్రపంచంలో జాతీయ, ప్రైవేట్ బ్యాంకులకు దీటుగా సేవలందిస్తున్న కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంకును ఆధునీకరిస్తున్న నేపథ్యంలో సేవలకు అంతరాయం కలుగుతున్నదని, ఇందుకు చింతిస్తున్నామని కొండూరి రవీందర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. పాత సాఫ్ట్వేర్ స్థానంలో కొత్తది అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఖాతా దారులకు కొంత అసౌకర్యం కలుగుతున్నదన్నా రు. మరో వారం పాటు ఇదే పరిస్థితి ఉంటుంద ని, ఖాతాదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
తాజావార్తలు
- 50 ఏండ్ల వితంతువుపై అత్యాచారం
- ఆరుగురు క్రికెటర్లకు ఆనంద్ మహీంద్ర బంపర్ గిఫ్ట్
- ఉత్తరాఖండ్‌లో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ
- డీసీసీబీలను మరింత బలోపేతం చేయాలి : సీఎస్
- బడ్జెట్ 2021 : స్మార్ట్ఫోన్లు, ఏసీల ధరలకు రెక్కలు?
- కాంగ్రెస్ ర్యాలీపై జలఫిరంగుల ప్రయోగం.. వీడియో
- దేశానికి నాలుగు రాజధానులు ఉండాలి: బెంగాల్ సీఎం
- యువకుడి ఉసురు తీసిన టిక్‌టాక్ స్టంట్
- 24న భారత్-చైనా తొమ్మిదో రౌండ్ చర్చలు
- బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ దాడి..!