యాసంగికి తీపికబురు

ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు వరకూ సాగునీరు
- ఈ నెల 15 నుంచి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన విడుదల
- జీరో నుంచి 346 కిలోమీటర్ వరకు ఇవ్వాలని నిర్ణయం
- చరిత్రలో మొదటిసారి 13.18 లక్షల ఎకరాలను తడిపేందుకు సిద్ధం
- ముఖ్యమంత్రి ముందుచూపుతోనే కాకతీయ కెనాల్ ఆధునీకరణ
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఈ యే డాది వానకాలం రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. ప్రాజెక్టులు నిండాయి. చెరువుల మత్తళ్లు దుంకాయి. నీరు పుష్కలంగా ఉండి, భూగర్భ జ లాలు కూడా పెరిగాయి. ఈ పరిస్థితులను పూర్తి గా పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. యా సంగి సీజన్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించింది. అందు లో భాగంగా స్టేజ్ -1 పరిధి అంటే.. ఎల్ఎండీ ఎగువన 4,63,920 ఎకరాలు, ఎల్ఎండీ దిగు వన 5,05,720 ఎకరాలకు నీరిచ్చేందుకు సిద్ధమైంది. మొత్తంగా స్టేజీ-1 కింద 9,68,640 ఎకరాలకు సాగునీరు అందనున్నది. అలాగే స్టేజీ-2 కింద మొత్తం 3,50,000 ఎకరాలకు పూర్తి స్థాయి లో నీరు ఇవ్వాలని నిర్ణయించింది. అంటే 0 నుం చి 346 కిలోమీటర్ వరకు.. అదే చివరి కాలు వ కింద ఉన్న ఆయకట్టునూ తడిపేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. అందుకోసం ఎగు వ ఎల్ఎండీ పరిధిలోని ఆయకట్టుకు 46 టీఎంసీలు, దిగువ ఎల్ఎండీ పరిధిలోని ఆ యకట్టుకు 40 టీఎంసీలు నీరు అవసరం పడుతుందని అధికారులు అంచనా వేశారు. గత రబీ సీజన్లో 13 లక్షల ఎకరాలకు నీరు అందించగా, ఇప్పుడు సాగు మరింత పెరిగే అవకాశమున్నదని భావిస్తున్నారు. ఆ మేరకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక తయారు చేశారు. ఈ నీటిని ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి (8 రోజులు ఆన్, ఏడు రోజులు ఆఫ్) లో విడుదల చేయనున్నారు. ఎస్సారెస్పీలో ప్ర స్తుతం పూర్తిస్థాయిలో అంటే 90.313 టీఎంసీలు ఉండగా, ఎల్ఎండీలో 22.95 టీఎంసీలు, కడెం ప్రాజెక్టులో 6 టీఎంసీల నీరు ఉన్నది. అవసరాన్ని బట్టి శ్రీ రాజరాజేశ్వర జలాశయం నీటిని కూడా వినియోగించుకోవడానికి అవకాశమున్నది.
సీఎం దూరదృష్టితోనే ఆధునీకరణ..
ఒక వేళ వాతావరణ పరిస్థితులు సహకరించకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎస్సారెస్పీ ఆయకట్టు చివరి వరకూ ఇవ్వాలని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ మేరకు అవసరమయ్యే పనులను దూరదృష్టితో చేపట్టారు. కాకతీయ కాలువ మరమ్మతులు, ఆధునీకరణ చేయడంతోనే ప్రస్తు తం యాసంగి సీజన్లో ఎస్సారెస్పీ నీటిని చివరి వరకూ నీరు ఇవ్వడం సాధ్యమవుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కాకతీయ కాలువ గరిష్ఠ సామర్థ్యం 8,500 క్యూసెక్కులు కాగా, స మైక్య రాష్ట్రంలో నాలుగు నుంచి ఐదు వేల క్యూసెక్కులు విడుదల చేస్తేనే పలుచోట్ల గండ్లు పడ్డాయి. అయినా, నాటి ప్రభుత్వాలు దృష్టిపెట్టలేదు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న సీఎం.. నిర్ధారిత సామర్థ్యం మేరకు నీళ్లు ఇవ్వాలంటే 50 శాతానికి పైగా పాడైపోయిన కాకతీయ కెనాల్‌ను బాగుచేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఇంజినీర్లతో ఒక కమిటీ ఏర్పాటైంది. సదరు కమిటీ 20 రోజు ల పాటు కాలువలను పరిశీలించి నివేదిక ఇచ్చిం ది. దాని ప్రకారం ప్రభుత్వం వేయి కోట్లతో ఆ ధునీకరణ పనులు చేపట్టింది. అందులో భాగంగా ఎబో ఎల్ఎండీ అంటే కాకతీయకాలువ 0 నుంచి 146 కిలోమీటర్ వరకు వంద కోట్లతో పనులు పూర్తి చేసింది. అలాగే బీలో ఎల్ఎండీ అంటే.. 146 నుంచి 284 వరకు 774 కోట్లతో పనులు చేసింది. చివరి ఆయకట్టు వరకు వంద కోట్లకు పైగా కేటాయించి పనులు చేయించింది. అలాగే కాకతీయ కెనాల్ 146 నుంచి 191 కిలోమీటర్ మధ్య లైనింగ్‌తోపాటు 63 డిస్ట్రిబ్యూటరీల పరిధిలో కాలువలను ఆధునీకరించింది. ముందుచూపుతో చేసిన ఈ పనుల వల్ల ప్రస్తుతం చివరి ఆయకట్టుకు నీరు అందించేందుకు వీలు పడింది.
తాజావార్తలు
- ప్రకృతి ఒడిలో రాశీఖన్నా కసరత్తులు..వీడియో వైరల్
- 2,752 కరోనా కేసులు.. 45 మరణాలు
- కలబంద డయాబెటిస్‌కు వరం లాంటిదా.. ఎందుకు?
- వ్యవసాయశాఖ పొలం- హలం శాఖగా మారాలి : సీఎం
- నేపాల్ ప్రధానిని బహిష్కరించిన కమ్యూనిస్ట్ పార్టీ
- హైదరాబాద్‌కు దీటుగా ఖమ్మం అభివృద్ధి
- మూడు వారాల్లోనే ‘క్రాక్’..డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్
- పక్షులకు గింజలు వేసిన ధావన్..విచారణకు డీఎం ఆదేశం
- వేధింపులపై నటి నేహా శర్మ ఫిర్యాదు
- సుప్రీం బెంచ్ ఏర్పాటుకు దక్షిణాది బార్ కౌన్సిల్స్ డిమాండ్