సంజయ్.. చేసిందేందో చెప్పు

- ఈ రెండేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి పైసా అయినా తెచ్చారా..
- టీఆర్ఎస్ సర్కారుతోనే కరీంనగర్ అభివృద్ధి
- మంత్రి గంగుల ఆధ్వర్యంలో వెయ్యి కోట్లతో పనులు
- కరీంనగర్లో నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత
- జిల్లాలో పలు కార్యక్రమాలకు హాజరు
కార్పొరేషన్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేందో చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. రెండేళ్లలో కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బుధవారం పర్యటించిన ఆమె, స్థానిక అతి పురాతనమైన గౌరీ శంకర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కరీంముల్లాషా దర్గాలో చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. అనంతరం కిసాన్‌నగర్‌లో జాగృతి కార్యకర్త పసుల చరణ్ వివాహ వేడుకకు హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. అంతకు ముందు శివాలయానికి వచ్చిన ఎమ్మెల్సీ కవితకు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవాలయం వద్ద మీడియాతో కవిత మాట్లాడారు. బండి సంజయ్ ఈ రెండేళ్లలో నియోజకవర్గ ప్రగతికి చేసింది శూన్యమన్నారు. కానీ, ఎన్నికలు వచ్చినప్పుడు తప్పుడు ప్రచారాలు, అబద్ధాలు మాట్లాడుతూ ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రగతికి ఎన్ని నిధులు తెచ్చారు..? అభివృద్ధికి ఏం చర్యలు తీసుకున్నారన్న విషయంలో ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మాని నియోజకవర్గ, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు దృష్టిపెట్టాలని బండి సంజయ్‌కు హితవుపలికారు. టీఆర్ఎస్తోనే కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, మంత్రి గంగుల కమలాకర్ రూ.వెయ్యి కోట్లకుపైగా నిధులు తెచ్చి రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నారు. కరీంనగర్ రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. కేబుల్ వంతెన, ఐటీ హబ్ వంటివి ఇందుకు నిదర్శనమని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా నగరాన్ని, రాష్ర్టాని అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతున్నదన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయని, ఎలా అమలు చేస్తున్నారన్న విషయంలో అన్ని రాష్ర్టాలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ విజయ, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మేయర్ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, కార్పొరేటర్లు, జాగృతి సంస్థ ప్రతినిధులు ఉన్నారు.
తాజావార్తలు
- చలి గుప్పిట ఢిల్లీ.. కప్పేసిన పొగమంచు..
- ప్రధాని చెప్పారు.. ఈటల పాటించారు
- 13 ఏళ్ల బాలికపై తొమ్మిది మంది లైంగిక దాడి
- వేములవాడలో చిరుతపులి కలకలం
- అన్ని పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు : సీఎం
- కష్టాల్లో భారత్.. కెప్టెన్ రహానే ఔట్
- రిపబ్లిక్ డే పరేడ్.. ట్రాఫిక్ ఆంక్షలు
- 23 వరకు ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేక బస్‌పాస్ కౌంటర్
- టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్‌లు
- మహారాష్ట్రలో నిలిచిన కొవిడ్ టీకా పంపిణీ