కరాటే విజేతలకు కలెక్టర్ అభినందన

కరీంనగర్ స్పోర్ట్స్: యూఎస్ఏలో ఆన్లైన్ ద్వారా ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా కేంద్రానికి చెందిన గోజిరాయ్ కరాటే అకాడమీ క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చూపారు. అకాడమీకి చెందిన జోయ ఆనమ్, జోయ ఖాన్, జరా ఖాన్, ఆర్మన్ఖాన్, ఇక్బాల్ ఉర్ రహమాన్ ఖాన్, మహ్మద్ సాజీద్, ఫర్హాన్ ఖాన్, ఫర్దీన్ఖాన్లు పాల్గొని పతకాలు కైవసం చేసుకున్నారు. కలెక్టర్ కే శశాంక తన కార్యాలయంలో బుధవారం ప్రతిభ చూపిన క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్రీడాకారులు శిక్షణ మధ్యలో ఆపకుండా బ్లాక్‌బెల్ట్ వరకు నేర్చుకోవాలన్నారు. కరాటేతో ఆత్మైస్థెర్యం, శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ శిక్షణ తీసుకోవాలన్నారు. ఇంటర్నేషనల్ గోజిరాయ్ కరాటే చీఫ్ ఇన్స్ట్రక్టర్ అన్వర్‌ఖాన్, గ్రాండ్ మాస్టర్లు అక్బర్‌ఖాన్, ఫమిదా ఖాతూన్, జయేందర్, జవేరియా పాల్గొన్నారు.