భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలు

- సామూహిక సత్యనారాయణ వ్రతాలు
- భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
హుజూరాబాద్‌టౌన్: పట్టణంతో పాటు అన్ని విలీన గ్రామాల్లో సోమవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని శ్రీసంతోషీమాత సహిత అయ్యప్పస్వామి దేవాలయంలో బ్రహ్మశ్రీ గూడ జగదీశ్వరశర్మ ఆధ్వర్యంలో వంద మంది జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేశారు. ఆంజనేయస్వామి, ప్రతాపవాడలోని రాజరాజేశ్వరస్వామి, శివరామాలయం, కొత్తపల్లిలోని శ్రీనాగేంద్రస్వామి, బోర్నపల్లి శివాలయంలో దీపాలు వెలిగించి, వ్రతాలు చేశారు. అయ్యప్పస్వామి, బోర్నపల్లి శివాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయాల ప్రధాన పూజారులు వెంకట్రావు, పందిళ్ల భాస్కర్‌శర్మ, అవధానుల భాస్కర్‌శర్మ, రామాచార్యులు, రాహులాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇల్లందకుంట : మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి, శివాలయాల్లో కార్తీక సందడి కనిపించింది. సాయంత్రం పాత దేవాలయంలో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జమ్మికుంట శివాలయంలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈవో సుధాకర్, అర్చకులు శేషం వంశీధరాచార్యులు, రామాచార్యులు, నవీన్‌శర్మ, దేవాలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
సైదాపూర్: మండలకేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలు వత్తులను కాల్చారు. చిన్నారులు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.
వీణవంక: మండలంలోని శివాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ఎంపీపీ ముసిపట్ల రేణుక, జడ్పీటీసీ మాడ వనమాల, వైస్‌ఎంపీపీ రాయిశెట్టి లత, పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
హుజూరాబాద్ రూరల్: చల్పూర్ శివాలయం, తుమ్మనపల్లి పంచముఖ ఆంజనేయస్వామి, సింగాపూర్ వెంకటేశ్వరాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించి, దీపాలు వెలిగించారు. సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.
తాజావార్తలు
- బైక్‌ను ఢీకొన్న లారీ.. దంపతుల సహా మరో మహిళ మృతి
- 18 నెలలపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత
- ‘క్రాక్’ సినిమాలో రవితేజ కొడుకుగా నటించిన బుడ్డోడెవరో తెలుసా..?
- ‘ది బీస్ట్’.. బైడెన్ ప్రయాణించే కారు విశేషాలు ఇవే..
- ‘ఓటిటి రిలీజ్‌పై స్రవంతి రవికిషోర్ సంచలన వ్యాఖ్యలు’
- సత్తా చాటితేనే సర్కారు కొలువు
- సురవరం జయంతి ఉత్సవాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష
- 17 అంశాలపై బైడెన్ తొలి సంతకం
- యాదాద్రీశుడి హుండీ ఆదాయం రూ. 64,92,590
- 'అడవుల రక్షణ, పునరుజ్జీవనం ప్రాతిపదికగా అవార్డుల ప్రదానం'