జోరుగా ధాన్యం కొనుగోళ్లు

- ఇప్పటికే 70 శాతం పూర్తి
- సన్నరకానికి ఏ గ్రేడ్ కింద రూ.1888 చెల్లింపు
- మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ
కొత్తపల్లి: మండలవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే 70 శాతం ధా న్యం కొనుగోలు చేశామని, మరో 15 రోజుల్లో పూర్తి చేస్తామని సంబంధిత అధికారులు చెబుతు న్నారు. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కొత్తపల్లి-2 చిం తకుంట-1, ఖాజీపూర్-1, బద్దిపల్లి-2, మల్కా పూర్-1లో, పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఎలగందు ల, కమాన్పూర్, నాగుల మల్యాలలో కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఐకేపీ ఆధ్వర్యంలో ఆసీఫ్నగర్లో ధాన్యం కేంద్రాన్ని ప్రారంభించా రు. నవంబర్ మొదటి వారం నుంచే కొనుగోళ్లు సాగుతున్నాయి. కాళేశ్వరం జలాలు, పుష్కలంగా వానలు పడడంతో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. దిగుబడులు సైతం పెరిగాయి. ఇప్పటి వరకు సు మారు 1 5వేల క్వింటాళ్ల దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేసినట్లు డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఎండీ ఫక్రుద్దీన్ తెలిపారు. అలాగే ఖాజీపూర్ కేంద్రం దా ్వరా 6600, మల్కాపూర్ కేంద్రం నుంచి 5400 క్వింటాళ్లు, బద్దిపల్లిలోని రెండు కేంద్రాల నుంచి 5వేల క్వింటాళ్లు, చింతకుంటలో 1500 క్వింటాళ్ల (దొడ్డు వడ్లు)ధాన్యం, ఆసీఫ్నగర్లో ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా ఇప్పటివరకు 3425 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించినట్లు నిర్వాహకులు పేర్కొంన్నారు. వీటితో పాటు సు మారు 3 వేల క్వింటాళ్ల సన్నరకం వడ్లను సేకరించినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుంచి ఇప్పటి వరకు మండలంలోని పలు గ్రామాల్లో 70 శాతం మేరకు ధాన్యం విక్రయించినట్లు మరో 15 రోజుల్లో 100 శాతం మేరకు కొనుగోలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పంటల కోత సమయంలో భారీ గా వర్షాలు కురవడంతో కొన్ని ప్రాంతాల్లో ధాన్యం రంగు మారినప్పటికీ ప్రభు త్వం ఆదేశాల మేరకు కొనుగోలు చేస్తున్నారు. కేంద్రాల వద్ద ఒకటి నుం చి రెండు ప్యాడీ క్లీనర్స్ను అందుబాటులో ఉంచి ధాన్యంలో ఉన్న తాలును తీసివేయిస్తున్నారు. తేమశాతం వచ్చిన ధాన్యానికి టోకెన్లు ఇచ్చి సీరియల్ ప్రకారం తూకం వేస్తువేసి రసీదులను వెంట వెంటనే అందజేస్తున్నారు. రెండు నుంచి మూడు రోజుల్లో ఖాతాల్లో డబ్బు లు జమవుతున్నాయని రైతులు సంతోషంగా చెబుతున్నారు.
37 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశాం..
ఇప్పటివరకు ఈ కేంద్రాల ద్వారా సుమారు 35వేల క్వింటాళ్ల దొడ్డు, 2 వేల క్వింటాళ్ల సన్నరకం వడ్లను కొనుగోలు చేశాం. రైతుల నుంచి ధాన్యం సేకరించిన వెంటనే వారికి రసీదులు అందజేస్తూ రెండు, మూడు రోజుల్లో వారి ఖాతాల్లో నగదు జమయ్యేలా చూస్తున్నాం.
- ఎండీ ఫక్రుద్దీన్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ప్రతి గింజనూ కొంటాం..
పండించిన ప్రతి గింజనూ కొంటాం.
రైతులు సన్నరకం వడ్లను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలి. వాటికి ప్రస్తుతం ఏ గ్రేడ్ కింద రూ 1888చెల్లిస్తాం. ప్రభుత్వం బోనస్ ప్రకటిస్తే వారి ఖాతాల్లో తిరిగి డబ్బులు జమ చేస్తాం.
- రంజిత్, ఏవో కొత్తపల్లి
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు