ఆదివారం 24 జనవరి 2021
Karimnagar - Nov 28, 2020 , 01:27:52

నేరస్తులకు శిక్ష పడేలా చూడండి

నేరస్తులకు శిక్ష పడేలా చూడండి

  • ఎస్పీ శ్వేతారెడ్డి

కామారెడ్డి టౌన్‌ : నేరస్తులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్వేతారెడ్డి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. పీడీ యాక్ట్‌ కేసుల్లో జైలులో ఉన్న నేరస్తులకు త్వరగా శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల్లో ఉన్న ప్రాపర్టీని డిస్పోజ్‌ చేసేందుకు కోర్టు ద్వారా ఆదేశాలు వచ్చేలా చూడాలన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేస్తే నేరస్తులకు శిక్ష పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కన్విక్షన్‌ రేటు పెరుగుతుందని తెలిపారు. సమన్వయపర్చడానికి ఇలాంటి సమావేశాలు ఎంతగానో దోహదపడుతాయని, ముఖాముఖి చర్చలతో అన్ని విషయాలు పూర్తిగా చర్చించవచ్చని అన్నారు. పీవోసీఎస్‌వో యాక్ట్‌ కేసుల్లో విచారణ, విధి విధానాలపై చర్చించారు. సమావేశంలో డీఎస్పీలు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. logo