ఆదివారం 17 జనవరి 2021
Karimnagar - Nov 28, 2020 , 00:56:47

పథకాలతోనే టీఆర్‌ఎస్‌ గెలుపు

పథకాలతోనే టీఆర్‌ఎస్‌ గెలుపు

రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌టౌన్‌:అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పే ర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 140వ డివిజన్‌ లో జగదీశ్‌కు మద్దతుగా పలు కుల సం ఘాల నేతలతో మంత్రి విడివిడిగా కలిసి మాట్లాడారు. అలాగే పలు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా మం త్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎ మ్మెల్యే రేఖానాయక్‌తో కలసి శుక్రవా రం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ఈటల రాజేందర్‌ మా ట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అమ్మే ఆ లోచనలో ఉందన్నారు. అందుకే కేంద్ర ప్ర భుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మేయాలని చూడడం ప్రజల పాలిట శాపంలా మారుతున్నదన్నారు. ఓటుతో ఈ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్తే వారిలో కొంతైనా మార్పు వస్తుందన్నారు. ఇక్క డ జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు,  హుజూరాబాద్‌ టీ ఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు తుమ్మేటి స మ్మిరెడ్డి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శి కొలిపా క శ్రీనివాస్‌, ఎండీ రియాజ్‌, యువజన పట్టణాధ్యక్షుడు గందె సాయిచరణ్‌, ఈ టల జనసేన నాయకుడు ఇమ్మడి సతీశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు గందె శ్రీనివాస్‌, ఎండీ ఇమ్రాన్‌, పంజాల నాగరాజుగౌడ్‌, సునీల్‌గౌడ్‌ పాల్గొన్నారు.