సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయి

చొప్పదండి: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని 102 డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి సీఎన్ రెడ్డికి మద్దతుగా శుక్రవారం ఆయన ఇంటింటా ప్రచారం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. తన పిలుపు మేరకు చొప్పదండి నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్‌కు వచ్చి ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారని, ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారంలో భాగంగా కాలనీవాసులు ఎమ్మెల్యేను సన్మానించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నేత్రపర్వంగా సీతారాముల కల్యాణం
కరీంనగర్ కల్చరల్: నగరంలోని శ్రీపురంకాలనీలో గల భక్తాంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. నవగ్రహ, శివ పంచాయతన భక్తాంజనేయస్వామి విగ్రహ పునఃప్రతిష్ఠాపనోత్సవాల్లో భాగంగా చిన జీయర్‌స్వామి శిష్యుడు శేషం వెంకటరమణాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విగ్రహాల స్థిర ప్రతిష్ఠాపన శాస్ర్తోక్తంగా చేశారు. పూర్ణాహుతి అనంతరం స్వామి వారి కల్యాణం జరిపించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జోగినపల్లి రవీందర్రావు దంపతులు, మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి స్నేహలత, భక్తులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ ప్రమాణం
- అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం
- ఆ నలుగురు కరోనా టీకా వల్ల చనిపోలేదు: కేంద్ర ఆరోగ్య శాఖ
- అమెరికాలో సరికొత్త రోజు : జో బైడెన్
- స్పెయిన్‌లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
- దీర్ఘకాలిక వీడ్కోలు కాదు.. తాత్కాలికమే : డోనాల్డ్ ట్రంప్
- బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఒబామా, క్లింటన్, బుష్
- ట్రాఫిక్ నిర్వహణపై జీహెచ్ఎంసీ సమావేశం
- బైక్‌ను ఢీకొన్న లారీ.. దంపతుల సహా మరో మహిళ మృతి
- 18 నెలలపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత