శనివారం 28 నవంబర్ 2020
Karimnagar - Nov 22, 2020 , 01:36:42

భూమి పూజ

భూమి పూజ

కరీంనగర్‌ హెల్త్‌: స్థానిక బొమ్మకల్‌ రోడ్‌లోని వరహాస్వామి గుడి సమీపంలో శనివారం ఆవోపా పట్టణాధ్యక్షుడు కట్కూరి సుధాకర్‌ ఆధ్వర్యంలో సంఘ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంజి స్వరాజ్‌బాబు, జిల్లా అధ్యక్షుడు పీవీ రామకృష్ణ, కార్యదర్శి కొండూరి శ్రీనివాస్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సామ నారాయణ, ఉప్పుల రామేశం, పట్టణ ప్రధాన కార్యదర్శి చికోటి శ్రీనివాస్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి జిల్లా అంజయ్య, కార్యవర్గ సభ్యులు బొడ్ల లక్ష్మీనారాయణ, మంచాల కిషన్‌, పాలెపు భూమయ్య, పాత రాధాకిషన్‌, పుల్లూరి రమేశ్‌, భద్రయ్య, గణేశ్‌, చాడ మహేశ్వర్‌, పాత గంగాధర్‌, జిల్లా కృష్ణమూర్తి, ఎల్లంకి ప్రదీప్‌, నీరుమల్ల లక్ష్మణామూర్తి తదితరులు పాల్గొన్నారు. 

పుస్తెమట్టెలు అందజేత

గంగాధర: తాడిజెర్రి గ్రామానికి చెందిన కరీంనగర్‌ డెయిరీ  సభ్యుడు రామిడి నారాయణ-తార దంపతుల కూతురు వివాహం శనివారం జరిగింది. డెయిరీ తరఫున వధువుకు గ్రామశాఖ సభ్యులు పుస్తెమట్టెలు అందజేశారు. డెయిరీ కరీంనగర్‌ యూనిట్‌ మేనేజర్‌ సుధాకర్‌ మాట్లాడుతూ కరీంనగర్‌ డెయిరీలో పాలు పోసిన రైతులకు కల్యాణమస్తు, పాడిరైతు భరోసా, ఉపకార వేతనాలు, పశుగ్రాసంపై రాయితీ రుణాలు వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. తాడిజెర్రి అధ్యక్షుడు వేములవాడ రవి, సూపర్‌వైజర్‌ నవీన్‌, డెయిరీ సభ్యులు పాల్గొన్నారు.

గ్రేటర్‌ ప్రచారానికి తరలిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు

రామడుగు: టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు పిలుపు మేరకు జీహెచ్‌ఎంసీలో ఎన్నికల ప్రచారం చేసేందుకు పార్టీ మండల నాయకులు  శనివారం హైదరాబాద్‌ తరలివెళ్లారు. టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ గంట్ల వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ తడగొండ అజయ్‌, సర్పంచులు జవ్వాజి శేఖర్‌, బండ అజయ్‌రెడ్డి, నాయకులు కలిగేటి లక్ష్మణ్‌, నర్సింబాబు, చంద్రారెడ్డి, సైండ్ల కరుణాకర్‌, మార్కొండ వెంకన్న, చిరుల రాంచంద్రం, లంక మల్లేశం, తదితరులున్నారు.