శుక్రవారం 27 నవంబర్ 2020
Karimnagar - Nov 14, 2020 , 01:34:03

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మంచి ర్యాంక్‌ సాధించాలి

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మంచి ర్యాంక్‌ సాధించాలి

కొత్తపల్లి: స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021లో కొత్తపల్లి మున్సిపల్‌కు మంచి ర్యాంక్‌ వచ్చేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని చైర్మన్‌ రుద్ర రాజు సూచించారు. పట్టణంలో శుక్రవారం ఆయన కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈసందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే మంచి ర్యాంకు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెత్తను రోడ్లపై, వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇంటింటికీ వచ్చే మున్సిపల్‌ వాహనంలో వేయాలని సూచించారు. అలాగే, ఇంట్లో మిగిలిన వ్యర్థాలను మురుగు కాలువల్లో వేయవద్దన్నారు. కొత్తపల్లిని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ  సహకరించాలని కోరారు. ఇక్కడ ఏఈ వెంకట్‌కుమార్‌, అధికారులు, సిబ్బంది ఉన్నారు.