కలాం ఆశయ సాధనకు కృషి చేయాలి

జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి పులి మధుసూదన్
కరీంనగర్ రూరల్: దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి పులి మధుసూదన్ పిలుపు నిచ్చారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాల (బాలుర-1)లో బుధవారం ప్రిన్సిపాల్ వొల్లాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నిర్వహించారు. ఈసందర్భంగా అబుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈసందర్భంగా మైనార్టీ సంక్షేమాధికారి మాట్లాడుతూ, దేశానికి అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలను కొనియాడారు. స్కూల్ డీఎల్సీ ఖాజామొయినొద్దీన్, విజిలెన్స్ అధికారి నసీం అహ్మద్, షౌకత్ అలీ, డిప్యూటీ వార్డెన్ సైఫొద్దీన్, గురుకుల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
హౌసింగ్‌బోర్డుకాలనీ/తెలంగాణచౌక్: నగరంలోని దక్కన్ హైస్కూల్లో తెలంగాణ మైనార్టీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (టీఎస్-ఎంఈఎస్ఏ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యాదినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి పులి మధుసూదన్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం గతేడాది ఉర్దూ మీడియం పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ జీపీఏ సాధించిన 25 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అలాగే, ఉర్దూ విలేకరులు, ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో టీఎస్-ఎంఈఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఫయాజ్‌అలీ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ ఎజాజ్, షేక్ నిస్సార్ అహ్మద్, సలహాదారు సర్వర్షా బియాబానీ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- హ్యాట్సాఫ్.. శార్దూల్, సుందర్‌లపై కోహ్లి ప్రశంసలు
- మొన్నటి కిమ్ పరేడ్ జో బైడెన్‌కు హెచ్చరికనా..?!
- ఆసక్తికర విషయం చెప్పిన రామ్..!
- జర్మనీలో ఘనంగా సంక్రాంతి సంబురాలు
- ప్రభాస్ చిత్రానికి హీరోయిన్స్ టెన్షన్..!
- ముంబైలో అవినీతి సిబ్బంది పట్టివేత
- ప్రజలలో చైతన్యం పెరగాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
- గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి
- ‘ఉప్పెన’ వేగాన్ని ఆపతరమా..!
- జీ7కు రండి.. ప్రధాని మోదీకి బ్రిటన్ ఆహ్వానం