ఇబ్బందుల్లేకుండా రిజిస్ట్రేషన్లు

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
కొడిమ్యాల: రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లేకుండా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న లబ్ధిదారుడికి పత్రాలు అందజేసి మాట్లాడారు. గతంలో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన అనంతరం అరగంటలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. ఏళ్ల తరబడి నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సాదాబైనామా దరఖాస్తులకు అవకాశం కల్పించారని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేన్నేని స్వర్ణలత, జడ్పీటీసీ సభ్యురాలు పునుగోటి ప్రశాంతి, తహసీల్దార్ రవీందర్రావు, వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అనుమాండ్ల రాఘవరెడ్డి తదితరులున్నారు.
తాజావార్తలు
- వాణిజ్య పంటలతోనే ఆర్థిక పరిపుష్టి సాధ్యం
- కల్తీరాయుళ్లపై కొరడాకు సిద్ధం
- ‘ప్రాపర్టీ ట్యాక్స్'తో పరిష్కారం
- పట్టభద్ర ఓటర్లు 181 %పెరుగుదల
- రిజర్వేషన్ల నిర్ణయంపై హర్షం
- ఉచితంగానే వ్యాధి నిర్ధారణ పరీక్షలు
- పాదచారులకు పై వంతెనలు
- అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగాలి
- ట్రేడ్ లైసెన్స్ ఇక తప్పనిసరి
- వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం