నగరాభివృద్ధిపై పాలకవర్గం దృష్టి

ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు
టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్దేశం
మూడు నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు
కార్పొరేషన్: నగరపాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్ల అభివృద్ధిపై పాలకవర్గం దృష్టిసారించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని సూచించారు. ఇటీవల నగరంలో ఓపెన్ జిమ్స్, పార్కులు, పబ్లిక్ టాయిలెట్స్, వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. వీటితో పాటు అన్ని డివిజన్లలో మురుగు కాలువలు, రోడ్లు, తాగునీటి పైపులైన్ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. పట్టణ ప్రగతి, ఎల్ఆర్ఎస్ ఫీజు, ఇతర గ్రాంట్ల ద్వారా వచ్చిన నిధులు అందుబాటులో ఉండడంతో సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించేందుకు బల్దియా పాలకవర్గం సిద్ధమవుతున్నది.
అందుబాటులో రూ. 60 కోట్లు
నగరపాలక సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెలా పట్టణ ప్రగతి కింద నిధులు మంజూరు చేస్తున్నది. వీటితో పాటు ఎల్ఆర్ఎస్, ఇతర గ్రాంట్ల కింద వచ్చిన రూ. 60 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని ఇటీవల నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో పాలనాపరమైన అనుమతులిచ్చింది. వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. అయితే ఇప్పటికే పలు పనులకు సంబంధించి అంచనాలు సిద్ధ్దం చేసినట్లు ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా మిగతా పనులకు సైతం టెండర్లు ఖరారు చేస్తామని వెల్లడించారు.
మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తాం
పట్టణ ప్రగతి, ఎల్ఆర్ఎస్, ఇతర గ్రాంట్ల నిధులతో నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. శివారు కాలనీల్లో మురుగు కాలువలు, రోడ్లు, తాగునీటి పైపులైన్ల పనులకు ప్రాధాన్యమిస్తాం. టెండర్లు పిలిచి సత్వరమే పనులు ప్రారంభిస్తాం. కరోనా నేపథ్యంలో పనుల్లో కొంత జాప్యం జరిగింది. ఇకపై వేగంగా చేపడుతాం. మూడు నెలల్లో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలి. -వై సునీల్‌రావు, మేయర్
తాజావార్తలు
- ట్రాక్టర్ ర్యాలీ అంతరాయానికి పాక్ ట్విట్టర్ ఖాతాల కుట్ర!
- 100 మంది మెరిట్ విద్యార్థులకు పరేడ్ చాన్స్!
- కంగన సంచలనం: ఆ డ్రెస్ కొనేందుకు డబ్బుల్లేవంట!
- లాలూ త్వరగా కోలుకోవాలి: నితీశ్ ఆకాంక్ష
- కార్గిల్‌లో అడ్వెంచర్ టూరిజం ప్రారంభం
- రూబీ గోల్డ్ యజమాని ఇఫ్సర్ రెహమాన్ అరెస్టు
- ఢిల్లీ వరకు రివర్స్‌లో ట్రాక్టర్ నడిపిన రైతు
- సుంకాలు మోయలేం.. జీఎస్టీ తగ్గించండి: ఫోన్ ఇండస్ట్రీ వేడికోళ్లు
- రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
- కూతుళ్లను డంబెల్‌తో కొట్టి చంపిన తల్లి