బుధవారం 02 డిసెంబర్ 2020
Karimnagar - Oct 31, 2020 , 01:02:55

ఎమ్మెల్సీ కవితను కలిసిన జాగృతి నాయకులు

ఎమ్మెల్సీ కవితను కలిసిన జాగృతి నాయకులు

తెలంగాణచౌక్‌/గంగాధర: నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని నివాసంలో శుక్రవారం తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి బాలసంకుల అనంతరావు, మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు గందె కల్పన, నాయకులు గందె విశ్వేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో జాగృతి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాయకులను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. జాగృతి కార్యక్రమాలను గ్రామగ్రామాన విస్తరించాలని సూచించినట్లు జాగృతి నాయకులు తెలిపారు.

కార్పొరేషన్‌/కొత్తపల్లి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని నివాసంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు జాడి శ్రీనివాస్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.