శుక్రవారం 27 నవంబర్ 2020
Karimnagar - Oct 31, 2020 , 00:45:45

స్వరాష్ట్రంలోనే ఆలయాల అభివృద్ధి

స్వరాష్ట్రంలోనే ఆలయాల అభివృద్ధి

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ 

శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ

కొడిమ్యాల: స్వరాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని చొప్పదండి ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. మండల కేం ద్రంలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయ పునర్నిర్మాణాన్ని దేవాదాయ శాఖ నిధులు రూ.50 లక్షలతో  చేపట్టగా శుక్రవారం ఎమ్మెల్యే భూమి పూజ చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉ మ్మడి రాష్ట్రంలో ఆలయాలను పట్టించుకోలేదన్నా రు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలయా ల అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. అనంతరం మండలకేంద్రంలో రూ.9 లక్షల 20 వేలతో నిర్మించనున్న విశ్వబ్రాహ్మణ సంఘ భవన నిర్మా ణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మండలంలోని తుర్కాశీనగర్‌కు చెందిన యూత్‌ సభ్యులకు క్రికెట్‌ కిట్లను మండలాధ్యక్షుడు అనుమండ్ల రాఘవరెడ్డి బహూకరించగా ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పూడూర్‌ అనుబంధ గ్రామం అరెపల్లికి చెందిన కుంట తిరుపతి అనారోగ్యంతో మృతిచెందగా ఎన్‌ఆర్‌ఐలు పంపించిన రూ.70 వేల ఆర్థిక సహాయాన్ని ఆయన బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. పూడూర్‌లో ఫార్మర్‌ బ్రిడ్జి రైతు వారధి కార్యాలయాన్ని ప్రారంభించారు. కొండాపూర్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు గుండు రాజుకుమార్‌ సోదరి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ మేన్నేని స్వర్ణలత, జడ్పీటీసీ సభ్యురాలు పునుగోటి ప్రశాంతి, వైస్‌ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్‌, దేవాదాయశాఖ డీఈ చంద్రశేఖర్‌, ఈవో కాంతారెడ్డి, కొడిమ్యాల సింగిల్‌విండో చైర్మన్‌ మె న్నేని రాజనర్సింగరావు, సర్పంచ్‌ ఏలేటి మమత, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు అనుమాండ్ల రాఘవరెడ్డి, ఉస సర్పంచ్‌ గడ్డం జీవన్‌రెడ్డి, నాయకులు గడ్డం లక్ష్మారెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, ఏలేటి నర్సింహారెడ్డి, తిరుపతిరెడ్డి, కొత్తూరి స్వామి, ప్రభుదాస్‌, అంకం రాజేశం, బండపల్లి అంజన్‌కుమార్‌, నేరెళ్ల మహేశ్‌, నరేందర్‌, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.