మంగళవారం 01 డిసెంబర్ 2020
Karimnagar - Oct 28, 2020 , 01:01:15

సీఎంఆర్‌ఎఫ్‌తో ఆర్థిక భరోసా

సీఎంఆర్‌ఎఫ్‌తో ఆర్థిక భరోసా

ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ 

లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అందజేత

గంగాధర: అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. మండలానికి చెందిన 40 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. 7 లక్షల 40 వేల ఆర్థిక సాయం మంజూరైంది. చొప్పదండిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా తమను ఆదుకున్న సీఎం కేసీఆర్‌, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.  జడ్పీటీసీ పుల్కం అనురాధనర్సయ్య, ఏఎంసీ చైర్మన్‌ సాగి మహిపాల్‌రావు, వైస్‌ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, సర్పంచులు మేచినేని నవీన్‌రావు, వేముల దామోదర్‌, మడ్లపెల్లి గంగాధర్‌, ముక్కెర మల్లేశం, ఎంపీటీసీ ద్యావ మధుసూదన్‌రెడ్డి, నాయకులు అట్ల శేఖర్‌రెడ్డి, రామిడి సురేందర్‌, అలువాల తిరుపతి, రేండ్ల శ్రీనివాస్‌, దూలం శంకర్‌గౌడ్‌,  దానె ఓదెలు పాల్గొన్నారు.