శుక్రవారం 27 నవంబర్ 2020
Karimnagar - Oct 25, 2020 , 04:38:26

నిండిన చెరువులు.. పండుగలా జీవితాలు

నిండిన చెరువులు.. పండుగలా జీవితాలు

సీఎం కేసీఆర్‌ కృషితోనే రాష్ట్రం సస్యశ్యామలం

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ 

మొగిలిపాలెంలో బతుకమ్మ విగ్రహం, ఘాట్‌  ప్రారంభం..

తిమ్మాపూర్‌ రూరల్‌: నిండైన బతుకమ్మలా జీవితాలు నిండుగా ఉండాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఊరూరా చెరువులను నిండుగా మార్చారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఉద్ఘాటించారు. మొగిలిపాలెంలో రూ.3.50లక్షలతో నిర్మించిన బతుకమ్మ ఘాట్‌ను, బతుకమ్మ తల్లి విగ్రహం, హైమాస్ట్‌ లైట్లను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు నెర్రెలు బారి కనిపించిన మొగిలిపాలెంలో నేడు చెరువులు నిండి మత్తళ్లు పొంగిపొర్లుతున్నాయని చెప్పారు. అతివృష్టి, అధిక వర్షాలతో నష్టం వాటిల్లినా రూ.1850 మద్దతు ధర ప్రకటించి, రైతులకు అండగా నిలిచారన్నారు. ఈ వానకాలంలోనే మక్క వద్దని చెప్పినా, రైతులు సాగు చేశారని, వారిని నష్టపెట్టకుండా ఉండేందుకే మద్దతు ధరతో మక్కలు కొనుగోలు చేస్తామని చెప్పారు. మండలంలోనే మొగిలిపాలెం గ్రామం అత్యధికంగా నిధులు వినియోగించుకుని అభివృద్ధి చేసుకున్నారని, ఇది కార్యకర్తల సమిష్టి కృషితోనే సాధ్యమైందన్నారు. రాబోయే కాలంలో మరిన్ని పనులు చేయాల్సి ఉన్నదని చెప్పారు. ఎంపీటీసీ చాడ తిలక్‌ప్రియ విన్నపం మేరకు కరీంపేట- మొగిలిపాలెం రోడ్డును పూర్తి చేశామని వివరించారు. ఉద్యమాల చోట అభివృద్ధి బావుట ఎగురవేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామంలో దుర్గామాత ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు కార్యకర్తలను పరామర్శించారు. ఇక్కడ ఇప్కో రాష్ట్ర డైరెక్టర్‌ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, సర్పంచి మోరపల్లి సుశ్మిత, ఎంపీటీసీ చాడ తిలక్‌ప్రియ, నాయకులు ఇనుకొండ జితేందర్‌రెడ్డి, రావుల రమేశ్‌, పాశం అశోక్‌రెడ్డి, మోరపల్లి రమణారెడ్డి, సంపత్‌ పాల్గొన్నారు.