గురువారం 03 డిసెంబర్ 2020
Karimnagar - Oct 25, 2020 , 04:38:24

స్వరాష్ట్రంలోనే ‘బతుకమ్మ’కు గుర్తింపు

స్వరాష్ట్రంలోనే ‘బతుకమ్మ’కు గుర్తింపు

సంస్కృతి, సాంప్రదాయాలను ముందు తరాలకు అందించాలి

మంత్రి ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌, జమ్మికుంటలో వేడుకలకు హాజరు  

హుజూరాబాద్‌: స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఉద్ఘాటించారు. శనివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని బతుకమ్మ సౌళ్లలో, జమ్మికుంటలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. సంస్కృతి, సాంప్రదాయాలను కొనసాగించి, ముందుతరాలకు అందించాలని సూచించారు. ఉద్యమంలో బతుకమ్మ పాత్ర మరువలేనిదని గుర్తు చేశారు. మహిళలంతా ఒక్కచోట చేరి ఆడుకునే ఇలాంటి పండుగ ప్రపంచంలో మరెక్కడా ఉండదన్నారు. అనంతరం మంత్రి బతుకమ్మను ఎత్తుకున్నారు. కరోనా నియమ నిబంధనలకు అనుగుణంగా బతుకమ్మ ఆడుతున్న మహిళలను ప్రత్యేకంగా అభినందించారు. కరోనా మహమ్మారి త్వరగా అంతంకావాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని వేడుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు గౌరమ్మను భక్తి శ్రద్ధలతో పూజించాలని మహిళలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, మార్కెట్‌ చైర్మన్‌ బర్మావత్‌ రమ, కౌన్సిలర్లు కళ్లెపెల్లి రమాదేవి, మారెపల్లి సుశీల, ప్రతాప మంజుల, మక్కపెల్లి కుమార్‌, గనిశెట్టి ఉమామహేశ్వర్‌, తాళ్లపెల్లి శ్రీనివాస్‌, బర్మావత్‌ యాదగిరి, తిరుమల్‌రెడ్డి, ముత్యంరాజు, ముక్క రమేశ్‌, గోస్కుల రాజు, కమిషనర్‌ జోన, నాయకులు బండ శ్రీనివాస్‌, కొలిపాక శ్రీనివాస్‌, గందె శ్రీనివాస్‌, బీఎస్‌ ఇమ్రాన్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేడుకలు అంబరాన్నంటగా, ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్‌రావు, టౌన్‌ సీఐ మాధవి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.