సోమవారం 25 జనవరి 2021
Karimnagar - Oct 24, 2020 , 02:07:10

కొనసాగుతున్న శరన్నవరాత్రోత్సవాలు

కొనసాగుతున్న శరన్నవరాత్రోత్సవాలు

 హుజూరాబాద్‌(జమ్మికుంట): జమ్మికుంటలో సుభాష్‌ యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత మండపంలో శుక్రవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. పూజారి రామకృష్ణాచార్యుల నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు తదితరులు పాల్గొన్నారు.

చిగురుమామిడి : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని దుర్గాదేవి మండపాల్లో దుర్గాదేవిని సరస్వతీమాతగా అకంకరించారు. ఇందుర్తి దుర్గామాత నిర్వాహకులు వినిశెట్టి అరుణాకిషన్‌ దంపతులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సర్పంచులు పిట్టల రజిత, చెప్యాల మమత, నగెల్లి వకుళ, పెద్దపెల్లి భవాని, అందె స్వరూప, పీచు లీల, గునుకుల అమూల్య తదితరులు ఉన్నారు.

తిమ్మాపూర్‌ : మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల్లో ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

మానకొండూర్‌ రూరల్‌: ముంజంపల్లిలో దుర్గామాత యూత్‌ సభ్యులు, మద్దికుంటలో శ్రీప్రగతి యూత్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండపాల్లో శుక్రవారం అమ్మవారు లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు శ్రీధరాచారి, శ్రీకాంతాచారి, రాజవీరమల్లు సమక్షంలో లక్ష్మీదేవికి కుంకుమార్చన తదితరల పూజలను నిర్వహించి,  తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. యూత్‌ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మానకొండూర్‌: మండల కేంద్రంలోని బ్రహేంద్రస్వామి ఆలయప్రాంగణంలో కొలువు దీరిన దుర్గామాత మండపంలో శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మీ అలంకరణలో దర్శనమిచ్చారు.  మండపంలో నిర్వహించిన కుంకుమపూజకు మహిళలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. భవానీమాత మాలధారులు నందగిరి శ్రీనివాస్‌, పెంచాల వేణుగోపాల్‌, బుర్ర సత్యం, సాగర్‌, రామ్‌లక్ష్మణ్‌, శ్యాం, భక్తులు  పాల్గొన్నారు. logo