గురువారం 03 డిసెంబర్ 2020
Karimnagar - Oct 22, 2020 , 02:14:10

హుజూరాబాద్‌ దవాఖానలో అత్యానిధుక ల్యాబ్‌

హుజూరాబాద్‌ దవాఖానలో అత్యానిధుక ల్యాబ్‌

అందుబాటులో ఫుల్లీ ఆటో అనలైజర్‌..  

ఒకేసారి 400 నమూనాలు, 40 రకాల పరీక్షల ఫలితాలు

మంత్రి ఈటల సమక్షంలో ల్యాబ్‌ను ప్రారంభించిన తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ రమేశ్‌

హుజూరాబాద్‌టౌన్‌: హుజూరాబాద్‌ దవాఖానలో సకల సౌకర్యాలతో కూడిన అత్యానిధుక ప్రయోగశాల(ల్యాబ్‌)ను ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అధునాతన వైద్య పరికరం ‘ఫుల్లీ ఆటో అనలైజర్‌'  బుధవారం  అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సమక్షంలో ల్యాబ్‌ను తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) కమిషనర్‌ డాక్టర్‌ రమేశ్‌ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించగా, ఫుల్లీ ఆటో అనలైజర్‌ పరికరాన్ని  కలెక్టర్‌ శశాంక ప్రారంభించారు. ఈ పరికరం పని తీరును టీవీవీపీ కమిషనర్‌ రమేశ్‌, ల్యాబ్‌ ఇన్‌చార్జి కిరణ్‌రెడ్డిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. సుమారు రూ. కోటి విలువైన ఈ పరికరాన్ని గాంధీ తర్వాత ఇక్కడే ఏర్పాటు చేశామని,   ఒకేసారి 400 మంది రక్త నమూనాలు సేకరించి పరీక్షిస్తే  నలభై రకాల వ్యాధులకు సంబంధించిన  ఫలితాలను వెల్లడిస్తుందని కమిషనర్‌ మంత్రికి తెలిపారు. రక్త పరీక్షల కోసం వరంగల్‌, కరీంనగర్‌ తదితర పెద్ద పట్టణాలకు వెళ్లకుండా ఈ ప్రాంత ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంత్రి వెంట కరీంనగర్‌ జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ రత్నమాల, హుజూరాబాద్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో జువేరియా, దవాఖాన మెడికల్‌ సూపరింటెండెంట్‌ రమేశ్‌, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, స్థానిక కౌన్సిలర్‌ తాళ్లపెల్లి శ్రీనివాస్‌గౌడ్‌, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అభిలాష్‌, జిల్లా మేనేజర్‌ విక్రమ్‌, టీం లీడర్‌ బీ ఆంజనేయులు  ఉన్నారు.

మాజీ సర్పంచ్‌కు మంత్రి పరామర్శ..

 ఆర్య క్షత్రీయ సంఘం జిల్లా అధ్యక్షుడు, బోర్నపల్లి మాజీ సర్పంచ్‌ అంగిరిక సంపత్‌రావు తండ్రి   రామారావు ఇటీవల గుండెపోటుతో మృతి చెందా డు.  కాగా, సంపత్‌రావును వైద్యారోగ్యశాఖ మం త్రి ఈటల రాజేందర్‌ బుధవారం రాత్రి వారి ఇం టికి వెళ్లి పరామర్శించారు.  రామారావు మృ తికి గల కారణాలను తెలుసుకొని ప్రగాఢ సాను భూతి ప్రకటించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌, పట్టణశాఖ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్‌ ఉన్నారు.