మంగళవారం 27 అక్టోబర్ 2020
Karimnagar - Oct 19, 2020 , 03:20:22

పథకాలు అర్హులకు అందేలా చూడాలి

 పథకాలు అర్హులకు అందేలా చూడాలి

ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌

టీఆర్‌ఎస్వీ మండలాధ్యక్షులకు నియామక పత్రాలు అందజేత

చొప్పదండి: రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన నియోజకవర్గంలోని ఆరు మండలాల టీఆర్‌ఎస్వీ మండలాధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌, అనుబంధ సంఘాల నాయకులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పని చేయాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన మండలాధ్యక్షులు ఆయా  మండలాల్లోని పార్టీ నాయకులతో కలిసి టీఆర్‌ఎస్వీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని సూచించారు. అనంతరం చొప్పదండి టీఆర్‌ఎస్వీ మండలాధ్యక్షుడిగా సిరివేని శ్రీకాంత్‌, రామడుగు అధ్యక్షుడిగా పైండ్ల మధు, గంగాధర అధ్యక్షుడిగా సాయిల్ల సంతోష్‌, కొడిమ్యాల అధ్యక్షుడిగా మహ్మద్‌ అక్బర్‌, మల్యాల అధ్యక్షుడిగా మునుగురి రాకేశ్‌, బోయినపల్లి అధ్యక్షుడిగా ఎండీ షఫికి నియామక పత్రాలు అందజేశారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ నియోజకవర్గ ఇన్‌చార్జి రేకులపల్లి సతీశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బందారపు అజయ్‌కుమార్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆరెల్లి చంద్రశేఖర్‌ గౌడ్‌, యువజన విభాగం అధ్యక్షుడు మారం యువరాజు, నాయకులు సత్యం, సురేశ్‌, జగన్‌, చోటు, ఓంకార్‌, నరేశ్‌, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

 సౌకర్యాలతో సంఘ భవనాలు నిర్మించాలి

చొప్పదండి: గ్రామాల్లో కులసంఘాల భవనాలు సకల సౌకర్యాలతో నిర్మించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. మండలంలోని గుమ్లాపూర్‌లో గౌడసంఘం, రెడ్డిసంఘం, మహిళా సంఘం, అంబేద్కర్‌ సంఘం భవనాలకు సంబంధించిన నిధుల మంజూరు పత్రాలను ఆయా కులసంఘాల అధ్యక్షులకు అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కులవృత్తుల అభ్యున్నతికి సర్కారు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. కులసంఘాల భవనాల్లో చిన్న చిన్న శుభకార్యాలు చేసుకునేలా నిర్మించాలని సూచించారు.  మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ బీసవేని రాజశేఖర్‌గౌడ్‌, కోఆప్షన్‌ సభ్యుడు పాషా, నాయకులు మాచర్ల వినయ్‌, బీసవేని ఓదెలు, లింగాల ఆనంద్‌, గణపతిరెడ్డి, బొడిగె రాజేశం, వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, కనుకయ్య, అజయ్‌, మహేశ్‌, పరశురాం తదితరులు పాల్గొన్నారు. 


logo