మంగళవారం 27 అక్టోబర్ 2020
Karimnagar - Oct 19, 2020 , 03:20:22

పోలీస్‌ అమరుల త్యాగం చిరస్మరణీయం

పోలీస్‌ అమరుల త్యాగం చిరస్మరణీయం

తిమ్మాపూర్‌ రూరల్‌: పోలీస్‌ అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు. అమరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మండలంలోని ఎల్‌ఎండీకాలనీలో గల శ్రీచైతన్య ఇంజినీరింగ్‌ కళాశాలలో తిమ్మాపూర్‌ సర్కిల్‌, ఎల్‌ఎండీ పోలీసులు.. తిమ్మాపూర్‌ మండల విలేకరుల మధ్య జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారోత్సవాల్లో భాగంగా క్రీడా పోటీలు నిర్వహించడం  సంతోషకరమన్నారు. క్రీడలతో పోలీసులు, పాత్రికేయుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్‌ సర్కిల్‌ సీఐ మహేశ్‌గౌడ్‌, ఎల్‌ఎండీ ఎస్‌ఐ కృష్ణారెడ్డి, ఇఫ్కో స్టేట్‌ డైరెక్టర్‌ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ప్రింట్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా విలేకరులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.


logo