మంగళవారం 27 అక్టోబర్ 2020
Karimnagar - Oct 19, 2020 , 03:20:21

కొడుకు గాయాన్ని చూసి భర్తను కడతేర్చింది

కొడుకు గాయాన్ని చూసి భర్తను కడతేర్చింది

మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి

పెనుగులాటలో కొడుకు చేతికి గాయం

ప్రతిఘటించి భర్తపై ఎదురుదాడి

దవాఖానకు తరలిస్తుండగా మృతి

ధర్మపురి మండలం నేరేళ్లలో ఘటన

ధర్మపురి రూరల్‌: మద్యం మత్తులో కత్తితో తనపై దాడికి దిగిన భర్తను ఆమె ప్రతిఘటించింది. ఆ ఘర్షణలో కుమారుడికి అయిన గాయాన్ని చూసి తట్టుకోలేక పోయింది. అదే కత్తితో భర్తపై ఎదురుదాడికి దిగింది. క్షణికావేశంలో కడతేర్చింది. ధర్మపురి మండలం నేరెళ్లలో జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గండికోట నర్సయ్య(45) ఆదివారం రాత్రి తాగి ఇంటికి చేరాడు. మద్యం మత్తులో భార్య తో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో కత్తి తీసుకొని భార్యపై దాడికి య త్నించాడు. పన్నెండేళ్ల వయస్సు ఉన్న వీరి కొడుకు తిరుపతి అడ్డుగా వెళ్లాడు. పెనుగులాటలో తిరుపతి మణికట్టుకు గాయాలయ్యాయి. కుమారుడి పరిస్థితి చూసిన అనసూర్య తీవ్ర కోపోద్రిక్తురాలై భర్త చేతిలో ఉన్న కత్తిని లాక్కొని అతడి తలపై వేటువేసింది. ఈ దాడిలో నర్స య్య తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనాస్థలానికి చేరుకొని అంబులెన్స్‌లో జగిత్యాల జిల్లా దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌ వైద్యశాలకు తరలిస్తుండగా.. మార్గంమధ్యలో మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా వీరి కూతురు శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు.logo