గురువారం 22 అక్టోబర్ 2020
Karimnagar - Oct 18, 2020 , 03:07:37

మదర్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులోకి సుధారాణి

మదర్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులోకి సుధారాణి

కరీంనగర్‌ కల్చరల్‌ : నగరంలోని కట్టరాంపూర్‌కు చెందిన కండెరావు సుధారాణి అలియాస్‌ తోట సుధారాణి హైదరాబాద్‌కు చెందిన మదర్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. చేయూత వెల్ఫేర్‌ సొసైటీ ద్వారా 15 ఏండ్లుగా సామాజిక రంగంలో ఆమె చేస్తున్న సేవలను గుర్తించి రికార్డ్స్‌లో పేరు నమోదు చేశామని సంస్థ జాతీయ అధ్యక్షుడు దాసరి స్వప్న మహేశ్‌ తెలిపారు. ఈ మేరకు సంస్థ అత్యుత్తమ పురస్కారం ఇంటర్నేషనల్‌ హైపై అవార్డు-2020, బుక్‌ ఆఫ్‌ రికార్డు పత్రం, ట్రోఫీ, మెడల్‌ను శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ చేతుల మీదుగా అందజేశారు. 


logo