బుధవారం 28 అక్టోబర్ 2020
Karimnagar - Oct 18, 2020 , 03:07:35

నీట్‌ ఫలితాల్లో ప్రైవేట్‌ ప్రభంజనం

నీట్‌ ఫలితాల్లో ప్రైవేట్‌ ప్రభంజనం

ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు యాజమాన్యాల అభినందనలు 

నీట్‌-2020 ఫలితాల్లో అల్ఫోర్స్‌, ట్రినిటి 

కళాశాలల విద్యార్థులు  ప్రభంజనం 

సృష్టించారు. అత్యుత్తమ మార్కులతో 

సత్తా చాటారు. ఆయా కళాశాలల చైర్మన్లు, లెక్చరర్లు వారిని అభినందించారు. 

- కరీంనగర్‌ కల్చరల్‌ 

అల్ఫోర్స్‌ హవా..

అల్ఫోర్స్‌ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపగా, శనివారం కళాశాల ఆవరణలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్‌ వీ నరేందర్‌ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో కూడా విద్యార్థులు ఇష్టంగా చదివి మంచి మార్కులు సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు. కళాశాలకు చెందిన పీ శ్రావణి 637 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ చూపిందన్నారు. అలాగే, వీ సాయికీర్తన 611 మార్కులు, ఆర్‌ అతిథిరెడ్డి  602 మార్కు లు, కే అనిరుధ్‌ 602 మార్కులు సాధించారని తెలిపారు. వీరితో పాటు 30 మంది విద్యార్థులు మంచి ప్రతిభ చూపారని చెప్పారు. వీరికి ఆలిండియా స్థాయిలో ర్యాంకులు వచ్చాయని, త్వరలో వెలువడే రాష్ట్ర స్థాయి ర్యాంకులతో వారికి సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. 

మమ్మీడాడీ ప్రోత్సాహం మరువలేనిది..

కరోనా కారణంగా పరీక్షలు జరుగుతాయో లేదోనని ఆందోళన చెందా. అప్పుడు మమ్మీడాడీ ధైర్యం చెప్పారు. లెక్చరర్లు గైడ్‌ చేశారు. రోజూ ఆన్‌లైన్‌ టెస్ట్‌లు పెట్టారు. అన్ని అంశాలపై అవగాహన పెంచారు. చైర్మన్‌ సార్‌ కూడా సలహాలు ఇచ్చారు. నేనూ ఇష్టంగా చదివా. ఈ క్రమంలో 637 మార్కులు సాధించా. 

- పీ శ్రావణి, విద్యార్థి (అల్ఫోర్స్‌ )

నీట్‌ లక్ష్యంగా చదివా.. 

మా పేరెంట్స్‌ ఇద్దరూ డాక్టర్లే. వారి స్ఫూర్తితోనే నేను నీట్‌కు ప్రిపేరైన.  ఈ విషయంలో మమ్మీడాడీ బాగా ప్రోత్సహించారు. లెక్చరర్లు సహకారం అందించారు. వీఎన్‌ఆర్‌ సార్‌ క్లాసులు, సబ్జెక్టులు విషయంలో గైడ్‌ చేశారు. అందరి ప్రోత్సాహంతో నేను బాగా చదివా. నాకు 611 మార్కులు వచ్చాయి. 

- వీ సాయి కీర్తన, విద్యార్థి (అల్ఫోర్స్‌)

ట్రినిటి సత్తా..

నీట్‌ -2020 ఫలితాల్లో ట్రినిటి విద్యార్థులు సత్తాచాటారు. శనివారం కళాశాలలో ఏర్పాటు  చేసిన కార్యక్రమంలో ట్రినిటి విద్యాసంస్థల చైర్మన్‌ డీ ప్రశాంత్‌రెడ్డి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించి, సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల పట్టుదల, అధ్యాపకుల అంకితభావంతోనే ఈ ఫలితా లు సాధ్యమయ్యాయని తెలిపారు. కరోనాతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినా, అధ్యాపకులు ఆన్‌లైన్‌, ఫోన్‌ కాల్స్‌ ద్వారా అందుబాటులో ఉన్నారని, ఎప్పటికప్పుడు విద్యార్థుల సందేహా లు నివృత్తి చేశారని చెప్పారు. ఈ క్రమంలోనే కళాశాలకు చెందిన విద్యార్థి వీ స్వాతి 631 మార్కులతో మంచి ప్రతిభ కనబరిచిందని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, కళాశాలకు చెందిన ఫిరోజ్‌ కమల్‌ 583, శ్రీజ 551, శరణ్య 547 మార్కులు సాధించారని, ఇలా మొత్తం 18 మంది విద్యార్థులకు మెడిసిన్‌లో సీటు లభించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. 

డాక్టర్‌ కావాలన్నదే లక్ష్యం.. 

చిన్నప్పటి నుంచి డాక్టర్‌ కావాలన్నదే నా లక్ష్యం. మా మమ్మీడాడీ ఎంతో ప్రోత్సహించారు. లెక్చరర్లు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించారు. వీటిని సద్వినియోగం చేసుకుని పట్టుదలతో చదివా. నీట్‌లో 631 మార్కులు సాధించా. రాష్ట్ర స్థాయి కోటాలో మంచి ర్యాంకు వస్తుంది.

- వీ స్వాతి, విద్యార్థి (ట్రినిటి )

చాలా సంతోషంగా ఉంది.. 

మా డాడీ కానిస్టేబుల్‌. నన్ను బాగా ప్రోత్సహించారు. నేనూ కష్టపడి చదివా. నాకు 583 మార్కులు వచ్చాయి. చాలా సంతోషంగా ఉన్నది. ప్రభుత్వ కళాశాలలో సీటు వస్తుందనే నమ్మకం ఉన్నది. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన తర్వాత స్పెషలైజేషన్‌, అనంతరం యూపీఎస్సీ వైపు వెళ్లాలన్నదే నా ఆకాంక్ష.  

- ఫిరోజ్‌ కమల్‌, విద్యార్థి ( ట్రినిటి )logo