బుధవారం 28 అక్టోబర్ 2020
Karimnagar - Oct 18, 2020 , 03:03:44

వరదకాలువపై తుది నివేదిక

వరదకాలువపై తుది నివేదిక

వేములవాడ, కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాల్లో  ఐదు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంలు

పలు చోట్ల పంప్‌హౌస్‌ల నిర్మాణాలు

సమీక్షించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌

పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రాజెక్టుల ఈఎన్‌సీ అనిల్‌కుమార్‌  

(కరీంనగర్‌ ప్రతినిధి,నమస్తే తెలంగాణ)

కాకతీయ కాలువ మధ్య ఉన్న భూములకే కాదు.. పలు మండలాల్లోని వరదకాలువ కుడి ప్రాంతానికి సాగునీరు అం దించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గతంలోనే ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయా ప్రాం తాల్లో స్థానికంగా ఉన్న రైతులు, ప్రజాప్రతినిధులతో సైతం సీఎం నేరుగా గతంలోనే ఫోన్‌లో మా ట్లాడగా.. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ఎప్పటికప్పుడు ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ మేరకు తుది నివేదిక సిద్ధం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వేములవాడ, కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి అసెంబ్లీ నియోజక వర్గాల్లో నిర్మించనున్న ఐదు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీములతో పాటు ఎస్సారెస్పీ ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ నుంచి సూరమ్మ (రుద్రంగి) చెరువులోకి ఎత్తిపోతల ద్వారా నీళ్లు తరలించేందుకు కావాల్సిన తుది ప్రతిపాదనలను ఇంజినీరింగ్‌ అధికారులు సిద్ధం చేశారు. ఈ తుదినివేదికపై రాష్ట్ర ప్రణాళికా సం ఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ శనివారం హైదరాబాద్‌లోని మంత్రుల అధికారిక నివాసంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రాజెక్టుల  

ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌తో కలిసి సమీక్షించా రు. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు ఈ వీడియో ప్రజంటేషన్‌లో సెల్‌ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్‌ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఎన్‌సీ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా కార్యాచరణను వివరించారు. లక్కాకుల చెరువు, కొత్త చెరువు సహా పలు చోట్ల నిర్మించనున్న పంప్‌హౌస్‌లను కూడా ఈ నివేదికలో చేర్చారు. ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌ నుంచి సూరమ్మ (రుద్రంగి) చెరువును నీళ్లతో నింపి, ఆ తర్వాత చెరువు కుడి, ఎడమ కాలువల ద్వారా పలు గ్రామాల్లోని దాదాపు 70 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించే కార్యాచరణను వారు సమీక్షించారు. దీనికి తోడు సూరమ్మ చెరువును ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ ద్వారా నింపడం వల్ల ఆ చెరువు కింద ఉండే పలు గ్రామాల్లోని దాదాపు 60 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించే ఆస్కారం ఉంటుంది. దీంతోపాటు చందుర్తి చెరువు నుంచి మోత్కారావుపేట చెరువును ఈ కెనాల్‌ ద్వారా నింపి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని వేలాది ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు సిద్ధం చేస్తున్న కార్యాచరణపైనా వారు సమీక్షించారు. అత్యంత వెనుకబడి, గల్ఫ్‌ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండే కథలాపూర్‌, మేడిపల్లి మండలాల్లోని గ్రామాలకు సాగు, తాగునీరు అందించేందుకు సీఎం ఆదేశాల ప్రకారం పనులు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. రెండు నెలలుగా ఇంజినీరింగ్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే పనులు చేపట్టి తుది నివేదికను రాష్ట్ర ఇరిగేషన్‌ ఈఎన్‌సీ మురళీధర్‌రావుకు శనివారం అందజేశారు. ఈ నివేదికను ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు త్వరలోనే సీఎం కేసీఆర్‌కు అందజేయనున్నారు.logo