సోమవారం 26 అక్టోబర్ 2020
Karimnagar - Oct 02, 2020 , 02:29:51

ఆస్తులన్నింటినీ ఆన్‌లైన్‌ చేయాలి

ఆస్తులన్నింటినీ ఆన్‌లైన్‌ చేయాలి

హుజూరాబాద్‌/వీణవంక:  గడువులోగా ఆస్తులన్నింటినీ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని  పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. గురువారం ఎల్‌ఆర్‌ఎస్‌, ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియపై పంచాయతీరాజ్‌శాఖ మంత్రి, ఆ శాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు  హుజూరాబాద్‌, సైదాపూర్‌, వీణవంక మండలాల ఎంపీడీవోలు, సర్పంచులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రోజువారీగా సేకరించిన ఆస్తుల వివరాలను వెంటవెంటనే ఆన్‌లైన్‌ చేయాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇందులో అ ధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా ముం దుకెళ్లాలని చెప్పారు. గ్రామంలోని ప్రతి  నివాసం వివరాలను నమోదు చేయాలన్నారు. గ్రామ ఆబాదిలో ఉంటే అలాగే నమోదుచేయాలని, పెంకుటిల్లు, బిల్డింగ్‌, రేకుల ఇండ్లను ఆన్‌లైన్‌ చేయాలని కోరారు.   ఎంపీడీవోలు గో ల్కొండ కృష్ణప్రసాద్‌, పద్మావతి, శశికళ, వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుక, ఎంపీవో రాజగోపాల్‌రెడ్డి, సర్పంచులు గూడూరి ప్రతాప్‌రెడ్డి, నేరెళ్ల మహేందర్‌ గౌడ్‌, కొడిగూటి శారద, బింగి కరుణాకర్‌, గుడిపాటి రజిత తదితరులు పాల్గొన్నారు. 


logo