మంగళవారం 20 అక్టోబర్ 2020
Karimnagar - Sep 29, 2020 , 02:10:47

ఘనంగా మేయర్‌ పుట్టిన రోజు

ఘనంగా మేయర్‌ పుట్టిన రోజు

  • n  కేక్‌ కట్‌ చేసిన వై సునీల్‌రావు, కార్పొరేటర్లు, నాయకులు 
  • n నగరంలో అన్నదానాలు,  పండ్ల పంపిణీ 

కార్పొరేషన్‌: నగరంలో మేయర్‌ వై సునీల్‌రావు 53వ పుట్టిన రోజు వేడుకలను సోమవారం కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు, నగర ప్రజలు, నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచి పెట్టి సంబురాలు చేసుకున్నారు.  పలువురు అన్నదానాలు, పండ్లు పంపిణీ చేశారు. కాగా, స్థానిక అయ్యప్ప ఆలయంలో మేయర్‌ వై సునీల్‌రావు-అపర్ణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేయర్‌ క్యాంపు కార్యాలయ సిబ్బంది, 33వ డివిజన్‌ ప్రజలు సునీల్‌రావుతో భారీ కేక్‌ కట్‌ చేయించారు. అనంతరం మేయర్‌ దంపతులను గజమాలతో సత్కరించారు. కార్యాలయ సిబ్బంది ప్రకాశ్‌, తదితరులు పాల్గొన్నారు. లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మేయర్‌ వై సునీల్‌రావు హాజరై కేక్‌ కట్‌ చేశారు. అంజన్‌రావు, తిరుపతి, రాకేశ్‌, శ్రీనివాస్‌, నరేందర్‌, రాజేందర్‌, రాజేశ్‌, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ చౌక్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుడు ఉయ్యాల శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 53 కిలోల కేక్‌ను మేయర్‌ కార్పొరేటర్లతో కలిసి కట్‌ చేశారు. కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్‌, ఆకుల నర్మద, ఐలేందర్‌యాదవ్‌, తుల శ్రీదేవి, అర్ష కిరణ్మయి, టీఆర్‌ఎస్‌ నాయకులు చంద్రమౌళి, వేణు, కట్ట సత్తయ్యగౌడ్‌, ఆకుల నర్సయ్య పాల్గొన్నారు. భగత్‌నగర్‌లోని భగత్‌సింగ్‌ విగ్రహానికి మేయర్‌ పూల మాల వేసి నివాళులర్పించారు. చైతన్య యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నం వడ్డించారు. ఈ కార్యక్రమంలో యూత్‌ క్లబ్‌ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. కార్పొరేటర్‌ గందె మాధవిమహేశ్‌ ఆధ్వర్యంలో నియో హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఆశ్రమంలో పిల్లలకు పండ్లు, బ్రెడ్‌ పంపిణీ చేశారు. అలాగే, కార్పొరేటర్‌ సరిళ్ల ప్రసాద్‌ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ విగ్రహం వద్ద కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. డివిజన్‌ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మేరు సంఘం  కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేశ్‌ కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. సంఘం నాయకులు మాడిశెట్టి నందగోపాల్‌, ఎం.స్వామి, లక్ష్మీనారాయణ, కిషన్‌, రమేశ్‌, శ్రీనివాస్‌, లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రచయితల సంఘం నాయకులు  అనిల్‌కుమార్‌, శంకర్‌, రవి మేయర్‌ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నగరపాలక సంస్థ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం నాయకులు మేయర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సంఘం నాయకులు దుగ్గు మహేందర్‌, రాకేశ్‌, గొల్లపల్లి శ్రీనివాస్‌, ఆకుల మోహన్‌, ఒర్సు కుమారస్వామి, శ్రీనివాస్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్‌ నేతికుంట యాదయ్య ఆధ్వర్యంలో స్థానిక క్యాన్సర్‌ దవాఖానలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్లు గందె మాధవి, గంట కల్యాణి, గుగ్గిళ్ల జయశ్రీ, కో-ఆప్షన్‌ సభ్యురాలు నందెల్లి రమ తదితరులు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్వీ నాయకులు పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌, సోమిరెడ్డి నరేశ్‌రెడ్డి, పటేల్‌ శ్రావణ్‌రెడ్డి, అజిత్‌రావు, మోహన్‌, అజయ్‌, కిరణ్‌కుమార్‌ మేయర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేయర్‌తో కేక్‌ కట్‌ చేయించారు. కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్లు లెక్కల స్వప్న వేణు, చాడగొండ బుచ్చిరెడ్డి, బండారి వేణు, వాల రమణారావు, నాంపెల్లి శ్రీనివాస్‌, తోట రాములు, కో-ఆప్షన్‌ సభ్యుడు పుట్ట నరేందర్‌, నాయకులు పవన్‌, తదితరులు మేయర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 

నృసింహస్వామి ఆలయంలో పూజలు

రేకుర్తి గుట్టపై ఉన్న నృసింహస్వామి ఆలయంలో మాజీ సర్పంచ్‌ నందెల్లి ప్రకాశ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. టీఆర్‌ఎస్‌ నాయకులు నర్సయ్య, వెంకటేశం, సతీశ్‌, తదితరులు పాల్గొన్నారు. కార్ఖానాగడ్డలోని వృద్ధుల ఆశ్రమంలో కార్పొరేటర్‌ ఎడ్ల సరిత అశోక్‌ పండ్లు పంపిణీ చేశారు. ఇక్కడ దండబోయిన రాములు, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, పాలకవర్గ సభ్యులు మేయర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మేయర్‌ వై సునీల్‌రావుకు డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌ పూల మొక్క అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. 

కమాన్‌ చౌరస్తా వద్ద..

కమాన్‌ చౌరస్తా వద్ద కార్పొరేటర్‌ లెక్కల స్వప్నవేణు కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, డివిజన్‌ ప్రజలు పాల్గొన్నారు. ఆదర్శ యూత్‌ ఆధ్వర్యంలో నగరంలోని వృద్ధులు, అనాథ పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. శ్రావణ్‌, కిశోర్‌, సతీశ్‌ పాల్గొన్నారు. సుభాష్‌నగర్‌లో కార్పొరేటర్‌ అర్ష కిరణ్మయి మల్లేశం ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. 

కరీంనగర్‌ హెల్త్‌: నగరంలోని 18వ డివిజన్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో 18, 19 డివిజన్ల కార్పొరేటర్లు మాధవికృష్ణాగౌడ్‌, ఎదుల రాజశేఖర్‌ ఆధ్వర్యంలో మేయర్‌ వై సునీల్‌రావు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచి పెట్టారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ఆయా డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు.

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి కార్యాలయంలో..

 నగరంలోని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ కార్యాలయంలో టీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో మేయర్‌ వై సునీల్‌రావు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచి పెట్టారు. అనంతరం చెన్నాడి దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ద్యావ మధుసూదన్‌రెడ్డి, సాయికృష్ణ, సంపత్‌, ఓంకార్‌, వేణు, లోకేశ్‌, పహీం, స్వామి, అనిల్‌, అజయ్‌, కల్యాణ్‌, అజిత్‌, సంపత్‌, ప్రవీణ్‌, సాగర్‌, సందీప్‌ పాల్గొన్నారు.

తెలంగాణచౌక్‌: 35వ డివిజన్‌లో మైనార్టీ నాయకుడు  గౌస్‌బాబా ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు బుచ్చిరెడ్డి, జీఎస్‌ ఆనంద్‌ కేక్‌ కట్‌ చేశారు. మైనార్టీ నాయకులు ఎండీ అక్బర్‌, తస్లీమా, హసీనా, అత్తర్‌ పాల్గొన్నారు.


logo