శనివారం 31 అక్టోబర్ 2020
Karimnagar - Sep 29, 2020 , 02:11:13

రేకుర్తి ఆలయ అభివృద్ధిపై హర్షం

రేకుర్తి ఆలయ అభివృద్ధిపై హర్షం

  • మంత్రి గంగుల ఫ్లెక్సీకి టీఆర్‌ఎస్‌ నాయకుల పాలాభిషేకం

కార్పొరేషన్‌: నగరంలోని రేకుర్తి గుట్టపై ఉన్న  లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధ్దికి కృషి చేస్తానని ప్రకటించిన రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఫ్లెక్సీకి సోమవా రం గుట్టపై టీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ సర్పం చ్‌ నందెల్లి ప్రకాశ్‌ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.  దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశా రు. ఈ సందర్భంగా  ప్రకాశ్‌ మాట్లాడుతూ గతంలోనే గుట్టపై ఉన్న దేవాలయాన్ని అభివృద్ధ్ది చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇ చ్చారని చెప్పారు.   మంత్రి అయినా తర్వాత రూ. 1.90 కోట్లతో పనులు చేపడుతున్నారని తెలిపారు. అలాగే మరో రూ. 3.50 కోట్లను  ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి గుట్టపై అన్ని సౌకర్యాలు కల్పించి అభివృద్ధ్ది చేస్తున్నారని పేర్కొన్నారు. స్వామి వారి ఆశీస్సులతో ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు వేగంగా పూర్తి కావాలని కోరుకుంటున్నామన్నారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు పొన్నాల తిరుపతి,  ఇంతియాజ్‌, ఖలీఫా, అబ్దు ల్లా, కూన నర్సయ్య, సత్తయ్య, పర్వతం తిరుపతి, లింగంపల్లి వెంకటేశ్‌, శనిగరపు సతీశ్‌, శ్రావణ్‌, రాజు, మోహన్‌ పాల్గొన్నారు.