మంగళవారం 27 అక్టోబర్ 2020
Karimnagar - Sep 29, 2020 , 02:11:13

షెడ్యూళ్ల వారీగా ఫైళ్లను సిద్ధం చేయాలి

షెడ్యూళ్ల వారీగా ఫైళ్లను సిద్ధం చేయాలి

  • కలెక్టర్‌ కే శశాంక
  • ఈ-ఆఫీస్‌ పాలనపై సమీక్ష

 కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: ఈ ఆఫీస్‌ (కాగిత ర హిత) పాలనలో భాగంగా షెడ్యూళ్ల వారీగా ఫైళ్లను సిద్ధం చేయాలని కలెక్టర్‌ శశాంక అధికారులను ఆ దేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు.  ఈ మెయిల్‌ను ఉపయోగించి ప్రతి డిపార్ట్‌మెంట్‌ ఫైళ్లు తయారు చేయడంలో కలెక్టరేట్‌లో ఉన్న ఎన్‌ఐసీ కోఆర్డినేటర్‌గా ఒకరిని   నియమిస్తామన్నారు. ఫైళ్లను ఏ నుంచి హెచ్‌ వరకు  పేర్ల ను నిర్ణయించి ఎక్సెల్‌లో చేసి ఇవ్వాలన్నారు. శా ఖల్లో ఫైళ్లు మూవ్‌మెంట్‌ అయ్యే విధంగా చూడాలన్నారు. ప్రతిరోజూ రెండు, మూడు డిపార్ట్‌మెం ట్ల వారీగా ట్రైనింగ్‌, బేసిక్‌ ఓరియంటేషన్‌ ఇస్తామన్నారు. షెడ్యూళ్ల వారీగా ఫైళ్లను  తయారు చే యడం ఉద్యోగులు నేర్చుకోవాలన్నారు. కలెక్టరేట్‌ లో కాగిత రహిత పాలన అనేది మొదటగా కలెక్టర్‌ కార్యాలయం నుంచే మొదలవుతుందని, దశ ల వారీగా మిగతా ఆఫీసులన్నింటిని కూడా ఈ ఆ ఫీస్‌ కిందికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామన్నా రు. నోట్‌, కరెంట్‌ ఫైళ్లను స్కాన్‌ చేయాలని, పాత ఫైళ్లను ఆన్‌లైన్‌ చేసి ఈ ఆఫీస్‌కు చేర్చుకోవాలన్నారు. ఎగ్జిస్టింగ్‌ ఫైళ్లు ఏమైనా ఉంటే వాటిని క్లోజ్‌ చేయాలన్నారు. ఎంప్లాయ్‌మెంట్‌ డాటా, ఈ మె యిల్‌, నేమ్‌ బేస్డ్‌, డిసిగ్నేషన్‌ బేస్డ్‌, ఫైల్‌ మేనేజ్‌మెంట్‌, ఫైల్‌ మూవ్‌మెంట్‌ ఈ ఆఫీస్‌లో ఉపయోగించాలన్నారు. కలెక్టరేట్‌లోని అన్ని కార్యాలయా ల్లో కాగిత రహిత పాలన అమలు చేయాలన్నారు. ప్రతి శాఖలో ఈ ఫైళ్లకు  సంబంధించి ఏమైనా కో ర్టు కేసులు, మిగతా ఫైల్స్‌ను అక్టోబర్‌ 10 వ తేదీలోగా పూర్తి చేసుకోవాలన్నారు.  అన్ని కార్యాల యాల్లో దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు  అందు బా టులో  ఉంచాలన్నారు. మహిళా ఉద్యోగులకు టా యిలెట్స్‌ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్‌, జిల్లా రె వెన్యూ అధికారి వెంకటమాధవరావు, వ్యవసాయాధికారి శ్రీధర్‌, జిల్లా పంచాయతీ అదికారి బు చ్చయ్య, పీ శ్రీదేవి, డీఆర్‌డీఏ సూపరింటెండెంట్‌ సురేశ్‌రెడ్డి, డీసీఎస్‌వో మధుసూదన్‌, డీఎండబ్ల్యూవో పూర్ణచందర్‌రావు, సీపీవో శ్రీకాంత్‌, డీ ఎం ఎ శివరాం, ఎన్‌ఐసీ వెంకటేశ్వర్‌రావు, అడిషనల్‌ డీఆర్‌డీవో అశోక్‌  పాల్గొన్నారు. 

ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలి..

తెలంగాణచౌక్‌ : ప్రజా సమస్యలను  ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించాలని కలెక్టర్‌ శశాంక  అధి కారులను ఆదేశించారు.  సోమవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో జిల్లా అధికారులతో కలిసి డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎంతో ఆశతో తమ సమస్యలు పరిష్కార మవుతాయని డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు ఫోన్‌ ద్వారా సమస్యలు తెలుపుతారన్నారు. ఇందులో వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులు నోట్‌ చేసుకుని వారంలోగా  పరిష్కరించి వారికి లేఖ ద్వారా తెలియజేయాలన్నారు. ఈ సం దర్భంగా కొత్తపల్లి నుంచి కిరణ్‌కుమార్‌ భూమి కో సం 2007లో కోర్టు ద్వారా ఉత్తర్వు తెచ్చుకున్నానని, నా పేరు మీద మ్యుటేషన్‌ ఇంతవరకు కాలేదని, చనిపోయిన వ్యక్తిపై మ్యుటేషన్‌ అయి ఉం దన్నారు. స్పందించిన కలెక్టర్‌ పరిష్కరిస్తామ న్నా రు. తిమ్మాపూర్‌ మండలం మహాత్మానగర్‌ నుంచి రాములు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కా ర్యాలయం నుంచి ఉన్న డ్రైనేజీని తొలగించి వేరే వైపు నుంచి కొత్తగా నిర్మిస్తున్నారని, మురుగునీరు  నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని  దృ ష్టికి తీసుకువచ్చారు.  డీపీవో పరిశీలించి పరిష్కరిస్తారని తెలిపారు. డయల్‌ యువర్‌ కలెక్టర్‌లో                పోలీస్‌ కమిషనర్‌కు 1, ఎల్‌ఆర్‌ఎస్‌ ఏడీకి 1, మున్సిపల్‌ కమిషనర్‌కు 5, ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈకి 2, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీకి 1, ఆర్‌అండ్‌బీ ఈఈకి 2, బీసీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌కు 1, జిల్లా విద్యాధికారికి 3, పంచాయతీ అధికారికి 5, లేబర్‌ ఆఫీసర్‌కు 1, మార్కెటింగ్‌ ఆ ఫీసర్‌కు 1, రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌కు 3, సివిల్‌ సప్ల య్‌ అధికారులకు 1, ట్రెజరీ ఆఫీసర్‌కు 1, హు జూరాబాద్‌ ఆర్డీవోకు 1, డిస్ట్రిక్ట్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌కు 1, కరీంనగర్‌ తహసీల్దార్‌కు 2, హుజూరాబాద్‌ తహసీల్దార్‌కు 1, కరీంనగర్‌ రూరల్‌ తహసీల్దార్‌కు 1, వీణవంక తహసీల్దార్‌కు 1, వారధి సొసైటీకి 2 ఫిర్యాదులు వచ్చినట్లు, వీటిని సంబంధిత అధికారులు పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. 


logo